Share News

Bandla Ganesh: అవసరాల కోసం పార్టీలు మారను: బండ్ల గణేశ్

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:22 PM

Bandla Ganesh: ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

 Bandla Ganesh: అవసరాల కోసం పార్టీలు మారను: బండ్ల గణేశ్
Bandla Ganesh

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ మణికొండలో పంచవటి సాయిలక్ష్మీ కాలనీలో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేశ్ పాల్గొని మాట్లాడారు. ‘ఈరోజు మా ఇంట్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకున్నాం. మా పాప ఈరోజు ఎవరి పుట్టినరోజని అడిగింది. దేవుడు పుట్టిన రోజు అని చెప్పా. సంక్రాంతి, దీపావళి పండుగ కన్నా పవిత్రమైన పండుగ చంద్రబాబు పుట్టినరోజు’ అని చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు.


చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని బండ్ల గణేశ్ కొనియాడారు. ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తా... అవసరాల కోసం పార్టీలు మారనని స్పష్టం చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయని బండ్ల గణేష్ ఉద్ఘాటించారు. భువనేశ్వరిలో ఉన్న గొప్ప రాజకీయ నాయకురాలు బయటకు వచ్చారని.. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంతో మారారని... తక్కువ టైంలో నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారని చెప్పారు. ముందు ముందు దేశ రాజకీయాల్లో లోకేష్ కీలక పాత్ర పోషిస్తారని ఉద్ఘాటించారు. ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు తన గుండెల్లో ఉంటారని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana Police: సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

Smita Sabharwal: ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా

Owaisi on Waqf Bill: వక్ఫ్‌ సవరణ చట్టంపై పోరాటం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 01:43 PM