Swetcha Suicide Case: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్
ABN , Publish Date - Jun 28 , 2025 | 10:45 AM
Swetcha Suicide Case: యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్, జూన్ 28: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ (Anchor Swetcha) ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణ చంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణ చంద్రతో ఉంటున్నట్లు సమాచారం. అయితే స్వేచ్ఛ, పూర్ణ చంద్రనాయక్ మధ్య కొన్నాళ్లుగా విబేధాలు చోటు చేసుకున్నాయని.. పూర్ణచంద్రతో కలిసి ఉండలేనని ఇటీవలే తన తల్లిదండ్రులకు యాంకర్ తెలిపినట్లు బయటపడింది.
పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణ చంద్ర మాట ఇచ్చాడని.. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతడు కాలయాపన చేసినట్లు సమాచారం. ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఓ టీవీలో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్ఛ.. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలో నివాసం ఉంటోంది. పెళ్లి అయినప్పటికీ భర్తతో విబేధాల కారణంగా విడిపోయిన స్వేచ్ఛ కొంత కాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ తరువాత తన కుమార్తెతో విడిగా ఉంటోంది. ఈ క్రమంలో గత రాత్రి తన నివాసంలోనే స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
2050లో హైదరాబాద్ ఎలా ఉండబోతోంది?
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
Read Latest Telangana News And Telugu News