Hyderabad: జూబ్లీహిల్స్‌పై హస్తం గురి.. బీఆర్‌ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు
ABN , Publish Date - Jun 28 , 2025 | 07:43 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్‌ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.

- క్షేత్రస్థాయి పరిస్థితులపై అంతర్గత సర్వే
- టికెట్ ఆశిస్తున్న నేతల బలాబలాలు ఆరా
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్(Jublihills) అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్‌ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీకి టికెట్లను ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా గెలవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీఆర్‌ఎస్(BRS) ఏ ప్రాంతంలో బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో ఆరా తీస్తోంది.
గతంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ టికెట్ తనకే దక్కుతుందని ధీమాను వ్యక్తం చేశారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారు. సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు.
ఎవరు బెస్ట్..
నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనార్టీ నేతను బరిలో నిలిపారు. అయినా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు వచ్చాయి. కాంగ్రె్‌సకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ఎవరిని నిలిపితే ఓట్లు పెరుగుతాయో అధినాయకులు ఇప్పటినుంచే ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ కావడంతో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అజారుద్దీన్‌తో పాటు, కాంగ్రెస్ మైనార్టీ నేత ఫయూమ్ ఖురేషీ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. నేతలు కూడా నియోజకవర్గంలో గెలుపు అవకాశాలపై సర్వేలు చేయించుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News