Home » Maganti Gopinath
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ డి-బ్లాక్ పార్కులో రూ.16 లక్షలతో పార్క్ పునర్ నిర్మాణం పనులకు, జి-బ్లాక్‌లో రూ.15.50 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Telangana: జూబ్లీహిల్స్‌లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, సిటీ ఇన్చార్జ్ మినిస్టర్ ఫోటోలను లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రెహమత్‌నగర్‌లో ఆందోళనకు దిగిన స్థానిక కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఖైరతాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti Gopinath) ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు హోరాహోరీగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో అక్కడక్కడ పలు ఘర్షణలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ నెల 9వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించారు.
తెలంగాణ భవన్ వేదికగా బయటపడిన బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు వెలుగు చూశాయి. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. శ్రీధర్ రెడ్డి పై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు
మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ( MLA Vivekananda Goud ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు.
Telangana Results: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో ఉన్నారు.
జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Maganti Gopinath ) ముఖ్య అనుచరుడు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను (Tannu ) మరోసారి అరచకానికి తెగబడ్డాడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై తీవ్రంగా దాడి చేశాడు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరోసారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్వార్లతో హల్చల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో విన్యాసాలు చేశారు.