Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కుట్ర.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:56 PM
కేటీఆర్‌తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదని విమర్శించారు.
హైదరాబాద్, నవంబరు9 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath)పై బీఆర్ఎస్ (BRS)కు ప్రేమ లేనేలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. గోపీనాథ్ ఆస్తులపై ఆమె సతీమణి సునీతతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ ఆస్తులను తారుమారు చేసేందుకు ఈ కుట్రలకు తెరదీశారని ఆక్షేపించారు. ఒక ఓటరు కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని... ఇంకో ఓటరు కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని ఆరోపించారు. ఇదిగో ఆ ఓటరు కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నానని వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్‌లో మాగంటి సునీత చదువుకోలేదని రాసిచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాగంగా ఇవాళ(ఆదివారం) బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆధారాలు పంపిస్తున్నా..
2025లో ఎన్నికల అఫిడవిట్‌లో పదోతరగతి వరకు మాగంటి సునీత చదువుకున్నారని రాసిచ్చారని చెప్పుకొచ్చారు. ఆధారాలు పంపిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ ఆధారాలను, తన దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు పంపించానని స్పష్టం చేశారు. గోపీనాథ్‌ని కన్నతల్లి కూడా చూడనీయకుండా ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యంతో కేటీఆర్ నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. పొరపాటున బీఆర్ఎస్‌ను గెలిపిస్తే... జూబ్లీహిల్స్ ప్రజల ఇళ్ల పత్రాలను తారుమారు చేసి దోచుకుంటారని ఆరోపించారు. . మాగంటి గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బెదిరించిన మాట వాస్తవమని తెలిపారు. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని స్పష్టం చేశారు బండి సంజయ్.
పార్కులను కూడా దోచుకుంటారు..
జూబ్లీహిల్స్‌లోని పార్కులను కూడా దోచుకుంటారు జాగ్రత్త అని హెచ్చరించారు. కేటీఆర్‌తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై విచారణ జరిపించడం లేదని విమర్శించారు. గోపీనాథ్‌కి చేతకాని పరిస్థితులో ఏఐజీ ఆస్పత్రిలో ఉంటే ఆయన తల్లిని ఎందుకు రానీవ్వలేదని ప్రశ్నించారు. కానీ అదే ఆస్పత్రిలో 9వ ఫ్లోర్‌లో మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదా..? అని నిలదీశారు. అందుకే చెబుతున్నా... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
బీజేపీ అంటేనే హిందువు..
హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు రూపంలో చూపించబోతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే హిందువు.. హిందువు అంటేనే బీజేపీ అని ఉద్ఘాటించారు. 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఔరంగజేబు వారసులు... బీజేపీ శ్రీరాముడి వారసులు...ఎవరూ కావాలో తేల్చుకోండి. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారంటే ఏమనాలని ప్రశ్నల వర్షం కురిపించారు. 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలిస్తే సొంత పైసలతో ఖబరస్థాన్ కట్టిస్తానని కేటీఆర్ చెప్పారు. ఆయన ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా..? అని సవాల్ విసిరారు బండి సంజయ్.
కేటీఆర్ ప్రమాణం చేయాలి..
రేపు(సోమవారం) ఉదయంలోపు కేటీఆర్ ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడు తానే బీఆర్ఎస్‌కి జూబ్లీహిల్స్ ప్రజల పక్షాన ఓటు వేయాలని అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్‌దని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్‌ని ఎవరూ పట్టించుకోరని సెటైర్లు గుప్పించారు. 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం తాను పోరాడితే పోలీసులు 60 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఏడుసార్లు జైలుకు పోయి వచ్చానని... కేటీఆర్‌తో తనకు పోలికా..? అని ఎద్దేవా చేశారు. మాగంటి గోపీనాథ్ జూన్ 8వ తేదీన చనిపోయారని వైద్యులు చెప్పారని... అదే నెల 25వ తేదీన గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్.
సర్వేలు తారుమారు కావడం ఖాయం..
‘సర్వేలన్నీ తారుమారు కావడం ఖాయం...బీజేపీ గెలుపు తథ్యం. జూబ్లీహిల్స్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా చేసి బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. జూబ్లీహిల్స్‌లో కనీస సౌకర్యాలు లేక అధ్వాన్నంగా మారడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లే కారణం. పదేళ్లలో రూ.6 లక్షల కోట్లు అప్పు తెచ్చినా కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. జూబ్లీహిల్స్‌లో పేదలకు ఒక్క ఇంటిని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇవ్వలేదు. రెండేళ్లలోనే రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ వాటిని దోచుకోవడమే తప్పా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం వద్ద పైసా లేనప్పుడు అభివృద్ధి ఎలా చేస్తారు.?. ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలు ఆలోచించాలి. జూబ్లీహిల్స్‌తో సహా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఎవరితో సాధ్యమవుతుందో మీరే ఆలోచించండి’ అని బండి సంజయ్ కోరారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చలువే...
‘ఇప్పటి వరకు తెలంగాణలో, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరుగుతోందంటే అది కేంద్రప్రభుత్వం చలువే. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే...హైదరాబాద్ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వివరాలను వెల్లడించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటేసి ఆశీర్వదిస్తే...కేంద్రంతో మాట్లాడి జూబ్లీహిల్స్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తాం. జూబ్లీహిల్స్ బాగుపడాలంటే కేంద్రమే ఆధారం. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డబ్బులు పంచుతున్నాయి. కాంగ్రెస్ రూ.7 వేలు ఇస్తే, బీఆర్ఎస్ రూ.5 వేలు పంచుతోంది. డబ్బులు తీసుకోండి... పువ్వు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ది చెప్పాలి’ అని బండి సంజయ్ హెచ్చరించారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కృషి..
‘బస్తీ దవాఖానాలకు, రైల్వేలకు, ట్రిపుల్ ఆర్‌కు, రోడ్లతో సహా హైదరాబాద్ అభివృద్ధికి ఇస్తున్న నిధులన్నీ కేంద్రానివే. అయినా ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి తెలంగాణకు నిధులు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించడం అత్యంత దుర్మార్గం. అసలు సీఎం ఎక్కడైనా రాష్ట్ర నిధులతో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిధులు ఖర్చు చేశారా..?. ముస్లిం అంటేనే కాంగ్రెస్సేనని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో జూబ్లీహిల్స్ ప్రజలు చూపబోతున్నారు’ అని బండి సంజయ్ హెచ్చరించారు.
బీజేపీ కార్యకర్తలకు బలం కావాలి..
‘బీఆర్ఎస్ పాలనలో బిల్డర్ల వద్ద నుంచి ఫ్లోర్‌లకు ఫ్లోర్‌లే తీసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో అపార్ట్‌మెంట్‌కు ఫ్లోర్ కడితే ఎంత ఖర్చయితే అంత బిల్డర్ల నుంచి వసూలు చేసి ఆ భారాన్ని కొనుగోలు దారులపై మోపుతున్నారు. ముస్లింలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వెంట పడి మరీ కుట్టు మిషన్లు, మిక్సర్, గ్రైండర్లు ఇస్తున్నారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోండి. జూబ్లీహిల్స్ ప్రజలారా. ఆలోచించండి. పోరాడే బీజేపీ కార్యకర్తలకు బలం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ (రేవంత్, కేటీఆర్) పాలన కొనసాగుతోంది. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో తేల్చుకోండి. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయే. కాంగ్రెస్ మెడలు వంచి అధికారంలో నుంచి దింపేది కూడా బీజేపీయే. లాఠీలు, కేసులకు భయపడకుండా ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీయే. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక్క గజం జాగానైనా కబ్జా చేశారా..? ఎక్కడైనా కమీషన్లు తీసుకున్నారా.?. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కమీషన్లు దండుకుంటున్నారు. పోలింగ్ రోజు జైశ్రీరాం అంటూ పువ్వు గుర్తుపై ఓటేసి దమ్ము చూపాలి’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం
రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది.. హరీశ్‌రావు ఫైర్
Read Latest Telangana News and National News