Share News

Jubilee Hills Bypoll-BRS: బీఆర్ఎస్‌ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్

ABN , Publish Date - Oct 21 , 2025 | 05:29 PM

జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను విడుదల చేసింది.

Jubilee Hills Bypoll-BRS: బీఆర్ఎస్‌ 40  మంది స్టార్ క్యాంపెయినర్స్
Jubilee Hills Bypoll-BRS

Jubilee Hills Bypoll-BRS: జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను విడుదల చేసింది. నవంబర్ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్‌ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్, క్యాంపెయిన్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకుంది.

ఈ జాబితాలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, పి. సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు కలేరు వెంకటేష్, ముత్తా గోపాల్, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.

ఈ నాయకులు రోడ్ షోలు, పబ్లిక్ మీటింగులు, డోర్-టు-డోర్ క్యాంపెయిన్‌ల ద్వారా ఓటర్లను చేరుకుని, పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తారు. కేసీఆర్.. పార్టీ అభ్యర్థికి బీ-ఫారమ్ ఇంకా రూ.40 లక్షల చెక్‌ను అందజేసిన సందర్భంగా, ఈ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వంపై రిఫరెండమ్‌లా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 'కాంగ్రెస్‌లోని 420 హామీలు ఓటర్లను మోసం చేశాయి. బీఆర్ఎస్ పాలనలో రైతులు, కార్మికులు, మహిళలు అందరూ ప్రయోజనాలు పొందారు' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ క్యాంపెయిన్ ద్వారా బీఆర్ఎస్, సానుభూతి ఫ్యాక్టర్‌ను కూడా ఉపయోగించుకుని, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ వార్ రూమ్‌ను కూడా ఏర్పాటుచేసి, క్యాంపెయిన్ వ్యూహాలను రూపొందిస్తోంది.ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పునరుద్ధరణకు కీలకమైనవిగా మారతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నానమ్మ వైద్యానికి సాయం కోరిన యువకుడికి ఊహించని షాక్..

జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించండి..

Updated Date - Oct 21 , 2025 | 05:52 PM