Secundrabad: రైల్వేల్లో అత్యుత్తమ జోన్ ఎస్‌సీఆర్..
ABN , Publish Date - Jun 28 , 2025 | 08:40 AM
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.

- మూడేళ్లలో 59,884 కోట్ల ఆదాయం
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది. 2022-23 నుంచి 2024-25 వరకూ ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా ద్వారా రూ.59,884 కోట్ల ఆదాయం సంపాదించడంతో భారతీయ రైల్వే బోర్డులో తన సమర్థతను నిలుపుకుంది. ప్రధానంగా సరకు రవాణాపై దృష్టిని కేంద్రీకరించడంతో రైల్వేశాఖ ఖజానాకు గత మూడేళ్లలో రూ. 40,535 కోట్లు, ప్రయాణికుల చార్జీల ద్వారా రూ.19,349కోట్ల లభించింది.
2024-25లో రూ.20,569 కోట్లు, 2023-24లో రూ.20,339 కోట్లు, 2022-23లో రూ.18,976 కోట్ల ఆదాయం చేకూరింది. ప్రయాణికుల చార్జీల కంటే సరకు రవాణాతోనే దక్షిణ మధ్య రైల్వే మూడింతల ఆదాయం సమకూర్చుకుంటున్నది. 2022-23లో 131.8 మిలియన్ టన్నుల సరకు రవాణాతో రూ.13,051 కోట్లు, 2023-24లో 141.1 మిలియన్ టన్నుల సరకు గమ్యస్థానాలకు చేర్చడంతో రూ.13,620 కోట్లు, 2024-25లో 144.1 మిలియన్ టన్నుల వస్తు రవాణాతో రూ.13,864 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకున్నది.
అధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో జాతీయ స్థాయిలో అత్యుత్తమ జోన్‌గా గుర్తింపు పొందామని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గత మూడేళ్లలో వివిధ స్థాయిల్లో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి సత్ఫలితాలు సాధించామన్నారు. సుమారు 960 కి.మీ మేరకు లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్‌తోపాటు కొత్త రైల్వే లైన్లను వినియోగంలోకి తేవడంతో ఆశించిన మేరకు సరకు రవాణాలో లక్ష్యాన్ని సాధించామని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News