Share News

Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. 24 దేశాల్లో కొత్త రకం స్పైవేర్ గుర్తింపు..

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:13 PM

అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..

Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. 24 దేశాల్లో కొత్త రకం స్పైవేర్ గుర్తింపు..
Zero Click Spyware on Whats app in 24 Countries

అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దీని వాడకంలో ఉండే సౌలభ్యం కారణంగా దాదాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్ని పనులకూ వాట్సాప్‌పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. యూజర్ల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కొత్త రకం స్పైవేర్ కనిపెట్టారు. 24 దేశాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను మొదలుపెట్టినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.


ఏ లింక్‌పై క్లిక్ చేయకున్నా.. ఫోన్ హ్యాక్ చేసేస్తున్నారు..

వాట్సాప్ ద్వారా జీరో-క్లిక్ హ్యాక్ విధానంలో యూజర్ ఏ లింక్‌పై క్లిక్ చేయకుండానే ఫోన్‌ హ్యాక్ అవుతోందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఈ అధునాతన స్పైవేర్ దాడి కారణంగా తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నారు. నివేదికల ప్రకారం మోస్ట్ డేంజరస్ సైబర్ గూఢచారులు కనీసం 24 దేశాలలోని వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు నిరూపణ అయింది. ఇటలీలో ఇలాంటివే ఏడు కేసులు నిర్ధారణ అయ్యాయి.ఆ వెంటనే మెటా కూడా స్పందించి.. ఇటలీ జాతీయ సైబర్ భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది.


ఈ యూజర్లే మెయిన్ టార్గెట్?

వాట్సాప్ యూజర్లను హ్యాక్ చేసేందుకు ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ పారగాన్ సొల్యూషన్స్‌తో లింక్ అయిన స్పైవేర్‌ను ఉపయోగించి జర్నలిస్టులు, కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేశారు. "జీరో-క్లిక్" హ్యాకింగ్ టెక్నిక్‌తో బాధితుడు ఏ చర్య చేయకున్నా వారి పరికరం హ్యాక్ అవుతుంది. ఈ రకం హ్యాకింగ్ అత్యంత మాదకరమైనదిగా పరిగణిస్తున్నారు.


వాట్సాప్ యూజర్లు డేటాను కాపాడుకునేందుకు ఇలా చేయాలి..

  • మీ వాట్సాప్‌ని వెంటనే అప్ డేట్ చేసుకోండి.

  • అదనపు భద్రత కోసం టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి.

  • అనుమానాస్పద కాల్స్, తెలియని మెసేజ్‌లకు స్పందించకండి.


రానున్న రోజుల్లో జీరో-క్లిక్ హ్యాకింగ్ పెద్ద ముప్పుగా మారుతుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్‌లోని డేటా అనధికార నిఘా నుండచి రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి.


ఇవి కూడా చదవండి..

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

ట్రాయ్ రూ.20 రూల్.. మీ సిమ్ వాడకపోయినా డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే..

Digital Detox: 'డిజిటల్ డిటాక్స్'.. ఇది మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేస్తుందా..

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 04:13 PM