Home » Meta
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా తాజాగా 700 మందికి ఉద్వాసన పలికింది. అయితే, అంతకు ముందు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ కొత్త స్టాక్ ఆప్షన్లు ప్రకటించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఏఐను అందిపుచ్చుకునే క్రమంలో ప్రముఖ కంపెనీలన్నీ అటు వైపు భారీగా పెట్టుబడలను పెడుతున్నాయి.
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ ఛాట్‌ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా.. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది. దీంతో ఏఐలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్‌బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు..
ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్‌గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..
టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ఓక్లీ, మెటా సంస్థలు (Oakley Meta Glasses) కలిసి కొత్త కళ్లజోళ్లను విడుదల చేశాయి. ఫ్యాషన్‌కు ఫ్యూచర్ టచ్ ఇచ్చే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో నిండిన ఆవిష్కరణగా నిలుస్తున్నాయి.
మెటా నుంచి కొత్త ఏఐ యాప్ వచ్చేసింది. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఉచితంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.