Share News

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

ABN , Publish Date - Apr 28 , 2025 | 06:11 PM

Meta AI Chatbot: నియమాన్ని అతిక్రమించి ఏఐ చాట్‌బాట్లో అశ్లీల సంభాషణలు సాగుతున్నాయి. అది కూడా చిన్న పిల్లలతో ఆ చాట్‌బాట్లు అశ్లీలకర సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం 14 ఏళ్ల బాలిక జాన్ సినా వాయిస్ ఉన్న ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించింది.

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్
Meta AI Chatbot

ప్రస్తుతం ఏఐ విప్లవం మొదలైంది. ప్రపంచాన్ని మొత్తం శాసించే దిశగా ఏఐ పరుగులు తీస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. మనకు ఏదైనా సమస్య వచ్చినపుడు ఏఐతో చర్చిస్తే చాలు.. పరిష్కారాలు కూడా చెప్పేస్తుంది. జనం అన్ని విషయాల్లో ఏఐ సాయం తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద సోషల్ మీడియా కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి ఏఐకు సంబంధించి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెటా కంపెనీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏఐ బాట్స్ అందుబాటులోకి తెచ్చింది. ఆ బాట్స్ ద్వారా యూజర్లు చాట్, వాయిస్ సంభాషణలు చేసే అవకాశం కల్పిస్తోంది. వాయిస్ సంభాషణల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారి వాయిస్ వాడుతోంది.


ప్రస్తుతం ఏఐ చాట్‌బాట్లో జాన్ సినా, క్రిస్టియన్ బెల్, జుడి డెంచ్ వంటి ప్రముఖుల వాయిస్లు అందుబాటులో ఉన్నాయి. సదరు సెలెబ్రిటీలకు కోట్ల రూపాయలు ఇచ్చి మెటా కంపెనీ ఆ వాయిస్‌లను వాడుతోంది. ఆ వాయిస్‌లను అశ్లీల సంభాషణలకు వాడమన్న నియమంతో మెటా వాటిని వినియోగిస్తోంది. అయితే, నియమాన్ని అతిక్రమించి ఏఐ చాట్‌బాట్లో అశ్లీల సంభాషణలు సాగుతున్నాయి. అది కూడా చిన్న పిల్లలతో ఆ చాట్‌బాట్లు అశ్లీలకర సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి.


కొద్దిరోజుల క్రితం 14 ఏళ్ల బాలిక జాన్ సినా వాయిస్ ఉన్న ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించింది. ఆ బాలికతో అత్యంత అశ్లీలంగా మాట్లాడింది. అదే జాన్ సినా క్యారెక్టర్ 17 అమ్మాయితో కూడా అశ్లీలంగా మాట్లాడింది. ఆ సంభాషణ గురించి చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏఐ చాట్‌బాట్ ప్రాజెక్టులో భాగమైన వారు చెబుతున్న దాని ప్రకారం.. ఆ చాట్‌బాట్స్‌కు జనం కనెక్ట్ అయ్యేలా.. మెటా రొమాంటిక్ రోల్ ప్లేలో యూజర్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసమే రూల్స్‌లో మార్పులు చేసింది. అయితే, మైనర్లు కూడా ఈ రొమాంటిక్ రోల్ ప్లేలో పాల్గొనటంతో సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలోనే మెటా అందులో మార్పులు చేసింది. మైనర్లకు రొమాంటిక్ రోల్ ప్లేను అందుబాటులో లేకుండా చేసింది.


ఇవి కూడా చదవండి

Volleyball Player: వాలీబాల్ ప్లేయర్ వికృత రూపం.. వందల మంది అమ్మాయిలతో..

Milk Delivery on Audi Car: పాలు అమ్ముకోవడానికి ఏకంగా బ్యాంక్ జాబునే వదిలేశాడు..

Updated Date - Apr 28 , 2025 | 06:52 PM