Share News

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:01 PM

ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్‌గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

అత్యధిక జీతాలతో విదేశాల్లో జాబ్ ఆఫర్ కొట్టే వారిని చాలా మందిని చూస్తుంటాం. కొందరు లక్షల్లో, మరికొందరు కోట్ల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగాల్లో చేరుతుంటారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ట్రపిట్ బన్సాల్ అనే వ్యక్తి రూ.854 కోట్లు ప్యాకేజీతో మెటాలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, మరో వ్యక్తి ఏకంగా రూ.1600 కోట్లకు పైగా ప్యాకేజీతో మెటలో చేరాడు. వివరాల్లోకి వెళితే..


ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ (Apple, Open AI, Google) తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా (Meta) అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్‌గా (AI Engineer) పని చేసిన రూమింగ్ పాంగ్‌కు రూ.1,600 కోట్లకు పైగా జీతం చెల్లిస్తూ మెటా సంస్థలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


రూమింగ్ పాంగ్ 2021లో ఆపిల్‌లో చేరాడు. చేరిన కొద్ది కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగాడు. రూమింగ్ తాను పని చేసిన కాలంలో సిరి, జెన్‌మోజీ, ఏఐపై పని చేస్తున్న 100 మంది ఇంజినీర్లను పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టారు. ఆపిల్‌కు సంబంధించిన అనేక ప్రతిష్టాత్మక ఏఐ ప్రాజెక్ట్‌లలో కీలకంగా వ్యవహరించాడు. ఆపిల్ కంటే ముందు పాంగ్.. గూగుల్‌లో లింగ్వో, జాంజిబార్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.


రూమింగ్‌ను తిరిగి తమ సంస్థలో కొనసాగించుకునేందుకు ఆపిల్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే పాంగ్‌కు మెటా ఆఫర్ చేసిన జీతం.. ఆపిల్‌ సంస్థ సీఈవో టిమ్ కుక్ వార్షిక పారితోషికానికి మించి ఉందని చెబుతున్నారు. ఇక రూమింగ్ విద్యార్థత విషయానికొస్తే.. ఇతను షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం నుండి BS, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి 2000లో మాస్టర్స్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అలాగే ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి PhD, కంప్యూటర్ సైన్స్ కూడా పూర్తి చేశాడు. కాగా, రూమింగ్ పాంగ్ జీతం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.


ఇవీ చదవండి:

చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 05:11 PM