Share News

Meta accounts: ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

ABN , Publish Date - Nov 20 , 2025 | 08:11 AM

16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

Meta accounts: ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..
Facebook Instagram underage accounts

ఆస్ట్రేలియా చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ డిలీట్ చేయబోతున్నట్టు తాజాగా మెటా ప్రకటించింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది (Meta under 16 accounts).


ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అనుగుణంగా మెటా కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ పదో తేదీ కంటే ముందే మెటా 16 ఏళ్ల లోపు పిల్లల అకౌంట్లను డిలీట్ చేయనుంది. డిసెంబర్ 4వ తేదీ కల్లా 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియన్లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగిస్తామని మెటా గురువారం తెలిపింది. నిషేధం అమల్లోకి రాకముందే టీనేజర్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించడం ప్రారంభించినట్టు పేర్కొంది. 'ఈరోజు నుంచి మెటా 13-16 సంవత్సరాల వయస్సు గల ఆస్ట్రేలియన్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లు, ఫేస్‌బుక్‌లకు యాక్సెస్ కోల్పోతారు' అని ప్రకటించింది (Facebook Instagram underage accounts).


డిసెంబర్ 10 నాటికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 16 సంవత్సరాల (Australia social media ban) కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను తొలగించాలని లేదా భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.


ఇవీ చదవండి:

ఈడీ కస్టడీకి అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్..


ఆత్మాహుతి అంటే బలిదానం.. వెలుగులోకి ఢిల్లీ పేలుళ్ల నిందితుడి సెల్ఫీ వీడియో..

Updated Date - Nov 20 , 2025 | 08:12 AM