Ind vs SA: మూడో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:43 PM
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పూర్తిగా విజయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో పూర్తిగా విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలను దాదాపు వదులుకున్నట్లే!
9/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. ప్రొటీస్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయింది. 201 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ మార్కూ యాన్సెన్(6/48) విజృంభించాడు. 288 పరుగులు వెనుకబడిన భారత్‌ను ‘ఫాలోఆన్’ ఆడించడానికి అవకాశం ఉన్నా సాతాఫ్రికా(Ind vs SA) రెండో ఇన్నింగ్స్ ఆడటానికే మొగ్గు చూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రికెల్‌టన్(13), మార్క్‌రమ్(12) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
పేలవ ప్రదర్శన
టీమిండియా టాప్-7 బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(58) ఒక్కడే రాణించాడు. 95/1తో మెరుగైన స్థితిలో కనిపించిన టీమిండియా.. తర్వాత అనూహ్యంగా వికెట్లు కోల్పోయి 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) విఫలమయ్యారు. ధ్రువ్ జురెల్ (0), రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఘోరంగా నిరాశపర్చారు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ (48; 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), కుల్‌దీప్ యాదవ్ (19; 134 బంతుల్లో) పోరాడారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం (208 బంతుల్లో) నెలకొల్పింది.
ఇవి కూడా చదవండి:
ఆ పోస్టులు డిలీట్ చేసిన స్మృతి!