Share News

IPL 2026: అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:44 PM

ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్‌ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్‌లో పేర్కొన్నారు.

IPL 2026: అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే ఐపీఎల్(IPL 2026) సందడి మొదలైంది. అయితే ఈసారి పెద్ద ట్విస్ట్‌ల నడుమ ఈ ఐపీఎల్ హడావిడి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది జట్ల నుంచి ఆటగాళ్లు మారుతూ ఉంటారు.. కానీ ఈ సారి జట్ల ఫ్రాంచైజీలే మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ విజేత రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు కూడా చేతులు మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


28-rcb.jpg

‘ఒకటి కాదు.. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది. అవే ఆర్సీబీ, ఆర్ఆర్. వీటిని దక్కించుకునేందుకు ఐదుగురు కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. వారిలో ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కనున్నాయో..! పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, యూఎస్ఏ.. కొత్త యజమానులు ఎక్కడి నుంచి వస్తారో..?’ అని హర్ష గొయెంకా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అయింది. ప్రస్తుతం ఆర్ఆర్.. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి ఫ్రాంచైజీలో 65శాతం వాటా ఉంది.


ఇటీవల ఆర్సీబీ (Royal Challengers Bengaluru) యజమాని డియాజియో కంపెనీ ఈ ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆర్సీబీ విక్రయం గురించి తొలుత ప్రముఖ పారిశ్రామికవేత్త అదర్‌ పూనావాలా ఈ ఏడాది అక్టోబరులో హింట్‌ ఇచ్చారు. పూనావాలాతో పాటు మరో రెండు ప్రముఖ సంస్థలు కలిసి ఆర్బీసీని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?

స్మృతి కోసం బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్పందించిన సునీల్ శెట్టి

Updated Date - Nov 28 , 2025 | 05:06 PM