Share News

Virat-Dhoni: ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?

ABN , Publish Date - Nov 28 , 2025 | 03:32 PM

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.

Virat-Dhoni: ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?
Virat-Dhoni

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్‌‌ చరిత్రలోనే వీరిది బెస్ట్ పార్ట్‌నర్‌షిప్. వీళ్లు కలిశారంటే ఫ్యాన్స్‌కు పండుగ. అయితే తాజాగా ధోనీ ఇంటికి కోహ్లీ వెళ్లాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం రాంచీ చేరుకున్న విరాట్‌ను.. ధోనీ తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు. ఆ తర్వాత మాహీనే స్వయంగా తన కారులో కోహ్లీ(Virat Kohli )ని హోటల్ దగ్గర దిగబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.


పంత్, గైక్వాడ్ కూడా..

నవంబర్ 30 నుంచి రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. దీంతో కోహ్లీతో కూడా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోనీ(MS Dhoni) ఇంటికి వెళ్లారు. మరోవైపు కోహ్లీకి ఇది కీలక సిరీస్‌గా మారనుంది. గత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన విరాట్.. మూడో వన్డేలో ఫామ్‌లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత.. ధోనీని కలవడంపై కూడా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ఆసియా కప్.. వైభవ్ సూర్యవంశీకి చోటు

అతి త్వరలోనే పెళ్లి.. స్పష్టం చేసిన పలాశ్ తల్లి

Updated Date - Nov 28 , 2025 | 03:32 PM