Vaibhav Suryavanshi: అండర్ 19 ఆసియా కప్.. వైభవ్ సూర్యవంశీకి చోటు
ABN , Publish Date - Nov 28 , 2025 | 02:44 PM
అండర్ 19 ఆసియా కప్‌నకు సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. కాగా ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్ వేదికగా జరిగే ఈ టోర్నీకి సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆయుష్ మాత్రే టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్, ఇటీవల ముగిసిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శలతో సెంచరీల బాదిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. విహాన్ మనోజ్ మల్హోత్ర వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ టోర్నీ అండర్ 19 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఆయా జట్లు భావిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనుంది.
భారత తుది జట్టు ఇదే..
ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్ర(వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్(వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కాన్షిక్ చౌహాన్, ఖిలాన్ ఎ.పటేల్, నమన్ పుష్పక్, డి.దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్దవ్ మోహన్, అరోన్ జార్జ్
స్టాండ్ బై: రాహుల్ కుమార్, హేమ్‌చు దేశన్ జె, బీకే కిషోర్, ఆదిత్య రావత్
ఇవి కూడా చదవండి:
దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ