Share News

Suniel Shetty: స్మృతి కోసం బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్పందించిన సునీల్ శెట్టి

ABN , Publish Date - Nov 28 , 2025 | 03:04 PM

అనివార్య కారణాల వల్ల స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్మృతి కోసం బీగ్‌బాష్ లీగ్‌కు దూరమైంది. ఈ విషయంపై ప్రముఖ నటుడు సునీల్ శెట్టి స్పందించారు.

Suniel Shetty: స్మృతి కోసం బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్పందించిన సునీల్ శెట్టి
Suniel Shetty

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురవ్వడం.. ఇంతలోనే స్మృతికి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమయంలో స్మృతి స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌కు జెమీమా దూరమైంది. ఈ విషయాన్ని ఆమె ప్రతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ జట్టు అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి మద్దతుగా ఉండేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty) ఈ విషయంపై స్పందించారు.


ఓ పత్రికలో వచ్చిన ఓ క్లిప్పింగ్‌ను పంచుకుంటూ.. ‘ఈ ఆర్టికల్‌ను చదివగానే నా మనసు కుదుటపడినట్టు తేలికగా అనిపించింది. మహిళల బీగ్‌బాష్ లీగ్‌ను వదిలి జెమీమా స్మృతి పక్కన ఉండాలని నిర్ణయించుకుంది. ఇంత కంటే ఓ స్నేహితురాలికి ఏం కావాలి? పెద్ద సాయాలు అవసరం లేదు.. ఆపదలో ఏం మాట్లాడకపోయినా నేనున్నా అనే తోడు ఉంటే చాలు. జెమీమా ఆ పని చేసింది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.


నవంబర్ 9న మహిళల బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుకు జెమీమా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే స్మృతి వివాహం కోసం పది రోజుల క్రితం జెమీమా భారత్‌కు తిరిగొచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ వేడుకలు నిలిచిపోయాయి. దీంతో స్మృతి, ఆమె కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు జెమీమా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు బ్రిస్బెన్ హీట్ జట్టు సీఈవో టెర్రీ స్వెన్సన్ ఓ ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ఆసియా కప్.. వైభవ్ సూర్యవంశీకి చోటు

అతి త్వరలోనే పెళ్లి.. స్పష్టం చేసిన పలాశ్ తల్లి

Updated Date - Nov 28 , 2025 | 03:07 PM