Ind Vs SL: మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:09 PM
డిసెంబర్ 21 నుంచి భారత మహిళల జట్టు శ్రీలంకతో ఐదు వన్డే సిరీస్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టు ఇటీవల వన్డే ప్రపంచ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత టీమిండియా తొలిసారిగా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. వాస్తవానికి టీమిండియా బంగ్లాదేశ్‌తో డిసెంబర్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అది వాయిదా పడింది. దీంతో మహిళల టీమిండియా శ్రీలంక(Ind Vs SL)తో పోటీ పడనుంది. ఈ మేరకు బీసీసీఐ ఈ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 21న వైజాగ్‌లో, చివరి మ్యాచ్ డిసెంబర్ 30న తిరువనంతపురంలో జరగనుంది. ఇది టీ20 ప్రపంచ కప్ 2026కు మొదటి సన్నాహకంగా భావిస్తున్నారు. 2024లో జరిగిన టోర్నమెంట్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు వెస్టిండీస్(2-1), ఇంగ్లండ్(3-2)తో జరిగిన సిరీస్‌లను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా ఆస్ట్రేలియా (ఫిబ్రవరి 2026), ఇంగ్లాండ్‌తో (మే 2026) తలపడనుంది.
టీమిండియా-శ్రీలంక టీ20 సిరీస్ షెడ్యూల్
ఆదివారం - 21 డిసెంబర్ - మొదటి టీ20 - విశాఖపట్నం
మంగళవారం - 23 డిసెంబర్ - రెండో టీ20 - విశాఖపట్నం
శుక్రవారం - 26 డిసెంబర్ - మూడో టీ20 - తిరువనంతపురం
ఆదివారం - 28 డిసెంబర్ - నాలుగో టీ20 - తిరువనంతపురం
మంగళవారం - 30 డిసెంబర్ - అయిదో టీ20 - తిరువనంతపురం
ఇవి కూడా చదవండి:
ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?
స్మృతి కోసం బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్పందించిన సునీల్ శెట్టి