Virat Kohli: సూర్యను వెక్కిరించిన కోహ్లీ.. ఈ వీడియో చూస్తే నవ్వాగదు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:09 PM
Suryakumar Yadav: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో ఫన్నీగా ఉంటాడు. సీనియర్లతో పాటు జూనియర్లను కూడా కలుపుకొని వెళ్తుంటాడు. జోక్స్ వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతవరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. ఈసారి అతడి కామెడీకి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడు.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ జోక్స్‌కు బాగా ఫేమస్. బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగితే అగ్రెషన్ మోడ్‌లోకి వెళ్లిపోయే కోహ్లీ.. ఫీల్డింగ్ టైమ్‌లో సహచర ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ జోక్స్ వేస్తూ అందర్నీ నవ్వల్లో ముంచెత్తుతాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో స్నేహం చేస్తుంటాడు విరాట్. యంగ్‌స్టర్స్‌తో కలసి అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటాడు. జోక్స్ వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇమిటేషన్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న కింగ్.. ఈ టాలెంట్‌తో తోటి ప్లేయర్లను వెక్కిరిస్తుంటాడు. తాజాగా అతడు ఇమిటేషన్‌తో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను వెక్కిరించాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అచ్చం సూర్యకుమార్‌లాగే..!
ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా డగౌట్‌లో కూర్చున్నాడు కోహ్లీ. మ్యాచ్‌లో ఆడని రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌తో కలసి జోక్స్ వేస్తూ నవ్వుల్లో మునిగిపోయాడు. ఇదే తరుణంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఇమిటేడ్ చేశాడు. గ్రౌండ్‌లోకి దిగితే నోట్లో చూయింగ్ గమ్ వేసుకోవడం సూర్యకు అలవాటు. బ్యాటింగ్, ఫీల్డింగ్ సమయంలో అతడు చూయింగ్ గమ్ నములడం గమనించే ఉంటారు. అదే సీన్‌ను నటించి చూపించాడు కోహ్లీ. నోరును అటూ ఇటూ అంటూ అతడు ఎలా నడుస్తాడో చూపించాడు విరాట్. ఎలా మాట్లాడతాడో కూడా చూపించడంతో అక్కడున్న సహచరులంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బారామతి వన్డేలో కోహ్లీ నిరాశపర్చాడు. కేవలం 5 పరుగులే చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఇవీ చదవండి:
డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే
ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌పై పగబట్టారా..
ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌మ్యాన్ తాండవం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి