Gujarat Titans: కొత్త ఓనర్ చేతికి గుజరాత్ టైటాన్స్.. ఇక అతడిదే హవా
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:23 PM
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. లీగ్‌లోని క్రేజీ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ మార్పు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

ఐపీఎల్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిశాక అందరి ఫోకస్ ఐపీఎల్ వైపు మళ్లనుంది. అయితే లీగ్ ఆరంభానికి ముందు బిగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పాపులర్ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మారిందని తెలుస్తోంది. మన దేశంలో బడా కంపెనీల్లో ఒకటైన టోరెంట్ గ్రూప్ జీటీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాటా ఎంత?
గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో దాదాపుగా 67 శాతం వాటాను కొనుగోలు చేయనుందట టోరెంట్ గ్రూప్. ఈ మేరకు జీటీకి అసలు ఓనర్స్ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నుంచి వాటాను కొనుగోలు చేయనుందట టోరెంట్ గ్రూప్. లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఈ విషయంపై ఫైనల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నారట. గవర్నింగ్ కౌన్సిల్ ఓకే చెప్పాకే టోరెంట్ గ్రూప్ వాటాపై స్పష్టత రానుందని సమాచారం. ఐపీఎల్-2025 ఆరంభానికి ముందే వాటాల మార్పు వ్యవహారం ఓ కొలిక్కి రానుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
కోచ్‌దే పెత్తనం!
ఐపీఎల్ కొత్త సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్‌లో టోరెంట్ గ్రూప్ హవా నడవనుందని తెలుస్తోంది. కొత్త ఓనర్స్ రాకతో జట్టుపై హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా పెత్తనం మరింత పెరగనుందని సమాచారం. గత యజమానులకు నెహ్రాకు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఐపీఎల్-2025కి ఆయన వేరే టీమ్‌కు మారతాడని కూడా వినిపించింది. అయితే మొత్తానికి అందులోనే కొనసాగుతున్నాడు నెహ్రా. ఇప్పుడు కొత్త ఓనర్స్ రాకతో టీమ్ వ్యవహారాలు మొత్తం హెడ్ కోచ్ చూసుకుంటారని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11లోకి ఇద్దరు మాస్ బ్యాటర్లు.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే
రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి