Rohit Sharma: రోహిత్ బ్లండర్ మిస్టేక్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:09 PM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. మెగా లీగ్ మొదలయ్యేందుకు మరికొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ తప్పిదం జట్టుకు భారీ ముప్పు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి పెద్దగా టైమ్ లేదు. వచ్చే నెలలో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. ఐసీసీ ట్రోఫీని మిస్ అవ్వొద్దని అన్ని జట్లు పంతంతో ఉన్నాయి. టీమిండియా కూడా మెగా కప్‌పై కన్నేసింది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నా.. భారత్ మ్యాచులు మాత్రం తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ప్రిపరేషన్స్‌లో భాగంగానే ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి మొదట్లో వన్డే సిరీస్ ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. అయితే మెగా టోర్నీకి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన బిగ్ మిస్టేక్ గురించి ఇప్పుడు డిస్కషన్స్ ఊపందుకున్నాయి. హిట్‌మ్యాన్ చేసిన ఆ తప్పు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
మొదటికే మోసం!
చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో పట్టుబట్టి ఇద్దరు స్టార్ బౌలర్లను తీసుకున్నాడు సారథి రోహిత్ శర్మ. అందులో ఒకరు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, మరొకరు వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి. అయితే ఈ ఇద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో గాయపడిన బుమ్రా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ సమయానికి అతడు 100 శాతం ఫిట్‌నెస్ సాధించడం కష్టమేనని బీసీసీఐ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. మరోవైపు షమీది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి.
ఎందుకింత రిస్క్?
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ స్క్వాడ్‌కు సెలెక్ట్ అయ్యాడు మహ్మద్ షమి. కానీ ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లోనూ అతడు బరిలోకి దిగలేదు. షమి ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని, టీమ్‌తో ట్రావెల్ అవుతూ బౌలింగ్ డ్రిల్స్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అతడి బౌలింగ్ తీరు, రనప్, ఫిట్‌నెస్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా గమనిస్తోందని తెలిసింది. పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు అతడ్ని బరిలోకి దింపే రిస్క్ తీసుకునేందుకు గంభీర్ సిద్ధంగా లేడని సమాచారం. బుమ్రా-షమి కంప్లీట్ ఫిట్‌గా లేనప్పుడు వాళ్లిద్దర్నీ చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదు?
బుమ్రా-షమి బరిలోకి దిగితే భారత్‌కు ఎదురుండదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే వాళ్లు ఫిట్‌నెస్ కారణాల వల్ల ఆడకపోయినా, గాయాలు తిరగబెట్టి టోర్నీ మొత్తానికి దూరమైతే పరిస్థితి ఏంటనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మూడో పేసర్‌గా అనుభవజ్ఞుడైన మహ్మద్ సిరాజ్‌ను తీసుకున్నా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాయాలతో బాధపడుతున్న వారిపై ఆశలు పెట్టుకోవడం సరైనది కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇంజ్యురీ ప్లేయర్లతో ఇబ్బందేనని తెలిసి కూడా రోహిత్ ఇలా చేయడం బ్లండర్ మిస్టేక్ అని.. గాయాలు తిరగబడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడని చెబుతున్నారు. సిరాజ్‌ను బ్యాకప్ బౌలర్‌గా తీసుకోకపోవడం కూడా తప్పేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్లాన్ ప్రకారమే అటాక్.. తిలక్ మామూలోడు కాదు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి