Home » Rohit Sharma
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.
భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.
రానున్న వన్డే ప్రపంచ కప్‌లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.
సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్‌మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.