ICC: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:41 PM
Men's T20I Team Of The Year 2024: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏకంగా నలుగురు స్టార్లకు చోటు దక్కింది. ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఫార్మాట్ల వారీగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లతో ఫైనల్ ఎలెవన్‌ను అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది ఐసీసీ. తాజాగా గతేడాది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్‌ను అనౌన్స్ చేసింది. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా ఎంపిక చేసింది ఐసీసీ. ఈ జట్టులో మరో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కడం విశేషం. అసలు టీ20 ఫైనల్ 11లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
భారత్ హవా!
ఐసీసీ ప్రకటించిన మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో రోహిత్ శర్మతో పాటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యంగ్ లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా నుంచి స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు స్థానం దక్కింది. ఇంగ్లండ్ నుంచి విధ్వంసక బ్యాటర్ ఫిల్ సాల్ట్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్ చోటు దక్కించుకున్నారు. సికిందర్ రజా (జింబాబ్వే), రషీద్ ఖాన్ (ఆఫ్ఘానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు.
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024:
రోహిత్ శర్మ (సారథి: భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్: వెస్టిండీస్), సికిందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక), జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్).
ఇవీ చదవండి:
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి
నేను రోహిత్‌లా కాదు.. ఆ పని చేయను: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి