Ashwin: క్రికెటర్లేమీ దేవుళ్లు కాదు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:42 AM
Ravichandran Ashwin: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటాడు. తాజాగా టీమిండియా సూపర్‌స్టార్ కల్చర్‌పై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సూపర్ స్టార్‌డమ్ సంస్కృతిని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుపట్టాడు. క్రికెటర్లు దేవుళ్లు కాదనీ, వాళ్లు సాధారణ జీవనం సాగించే విధానం అలవాటు చేసుకోవాలని సూచించాడు. ముఖ్యంగా భారత జట్టులో ఇలాంటి సంస్కృతి పెరిగిపోతున్నదని, దీనికి అడ్డుకట్ట వేయాలని ఒక హిందీ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ సూచించాడు. బ్యాటింగ్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇప్పటికే ఎంతో సాధించారని, వాళ్లు సెంచరీ చేస్తే దాన్ని ఆటలో భాగంగానే చూడాలన్నాడు.
ఆ కల్చర్ మనకొద్దు!
‘క్రికెటర్లు.. సూపర్‌స్టార్లు కాదు. వాళ్లను దేవుళ్లుగా చూడాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్‌డమ్, సూపర్ సెలెబ్రిటీల సంస్కృతిని ప్రోత్సహించొద్దు. ఆటగాళ్లుగా మనం సాధారణ జీవనం సాగించేలా ఉండాలి’ అని ఆ ఇంటర్వ్యూలో అశ్విన్ అన్నాడు. కాగా, జట్టులో సూపర్‌స్టార్ సంస్కృతి ఉండరాదని టీమిండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్ కూడా ఇటీవల కాస్త తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
తెలుగు బిడ్డ సంచలనం.. ఒక్క డైవ్‌తో..
అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి