SA vs NZ: డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:29 PM
Matthew Breetzke: సౌతాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీత్‌స్కీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం చేసి చూపించాడు. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు.

డెబ్యూ మ్యాచ్ అంటే ఎంతటి టాలెంటెడ్ ప్లేయర్‌కైనా భయం పట్టుకుంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. తప్పక రాణించాలనే ప్రెజర్‌ను తట్టుకొని పెర్ఫార్మ్ చేయడం అంత ఈజీ కాదు. అందునా డెబ్యూ ప్లేయర్ అంటే ఒత్తిడి రెట్టింపుగా ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని బెస్ట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ కొందరు అసాధారణ ఆటగాళ్లు ఇవేవీ పట్టించుకోకుండా దుమ్మురేపుతారు. స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తారు. సౌతాఫ్రికా కుర్ర ఓపెనర్ మాథ్యూ బ్రీత్‌స్కీ అదే చేసి చూపించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గుర్తుండిపోయే ఇన్నింగ్స్!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో మాథ్యూ బ్రీత్‌స్కీ భారీ సెంచరీతో మెరిశాడు. 148 బంతుల్లో 150 పరుగుల థ్రిల్లింగ్ నాక్‌తో అలరించాడు. 11 బౌండరీలు బాదిన మాథ్యూ బ్రీత్‌స్కీ.. 5 భారీ సిక్సులు కొట్టాడు. సింగిల్స్, డబుల్స్‌తో కివీస్ బౌలర్లను కంగారెత్తించిన సౌతాఫ్రికా చిచ్చరపిడుగు.. అడపాదడపా బిగ్ షాట్స్ ఆడాడు. తన జోన్‌లోకి వచ్చిన ప్రతి బాల్‌ను మైదానం బయటకు పంపించాడు. చూడచక్కటి కవర్ డ్రైవ్స్‌తో పాటు పుల్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత సాధించాడు మాథ్యూ బ్రీత్‌స్కీ. ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.
ఆపకపోతే ప్రమాదమే!
వన్డేల్లో డెబ్యూ మ్యాచ్‌లో 150 స్కోరు చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు మాథ్యూ బ్రీత్‌స్కీ. అతడి ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్ భారత్‌కు డేంజరే అని అంటున్నారు. త్వరలో మొదలవనున్న చాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా మన గ్రూప్‌లో లేదు. కానీ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఎదురుపడొచ్చు. అదే జరిగితే ఈ చిచ్చరపిడుగును ఆపాలని.. లేకపోతే రోహిత్ సేనకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌పై పగబట్టారా..
ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌మ్యాన్ తాండవం
చరిత్ర సృష్టించిన రోహిత్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి