IPL 2025: ఐపీఎల్ ట్రోఫీతో బాల సన్యాసులు.. ప్రమోషన్స్ మామూలుగా లేవుగా
ABN , Publish Date - Feb 28 , 2025 | 08:52 PM
IPL Trophy Tour: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తున్నాయి ఫ్రాంచైజీలు. తాజాగా బాల సన్యాసులతో జరిపిన ట్రోఫీ టూర్ ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

ఐపీఎల్ కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకో 3 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడంతా చాంపియన్స్ ట్రోఫీ-2025 మీద ఫోకస్ చేశారు. ఆటగాళ్లు, అభిమానుల నుంచి క్రిటిక్స్ వరకు అంతా మెగా టోర్నీ బిజీలోనే ఉన్నారు. ఒక్కసారి ఈ టోర్నమెంట్ ముగిసిందా ఫోకస్ మొత్తం ఐపీఎల్ మీదకు మళ్లుతుంది. అయితే అప్పటిదాకా ఫ్రాంచైజీలు ఆగేలా కనిపించడం లేదు. జోరుగా ప్రమోషన్లు చేస్తూ అభిమానుల్లో క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆసక్తిని డబుల్ చేస్తున్నాయి. తాజాగా సిక్కింలో నిర్వహించిన ట్రోఫీ టూర్లో బాల సన్యాసులు సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జోరుగా ప్రమోషన్స్
ఐపీఎల్-2024 చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. కొత్త సీజన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఐపీఎల్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సిక్కింలో నిర్వహించిన ట్రోఫీ టూర్లో కొందరు బాల సన్యాసులు సందడి చేశారు. క్యూట్‌గా ఉన్న నలుగురు బాల సన్యాసులు ట్రోఫీ ముందు ఫోజులు ఇచ్చారు. కండబలాన్ని చూపిస్తూ నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు చూసిన నెటిజన్స్.. బాల సన్యాసులు భలే క్యూట్‌గా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ జోరు మామూలుగా లేదని అంటున్నారు. ఈసారి వ్యూయర్షిప్ ఊహించని రేంజ్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు.. రోహిత్ సీక్రెట్ ఇదే
ఈ సిక్స్ చూస్తే కంగారూలకు నిద్రపట్టదు
ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి