ICC Champions Trophy 2025 Final: ఫైనల్ మ్యాచ్ టై అయితే.. ఎవరు చాంపియన్ అవుతారు
ABN , Publish Date - Mar 08 , 2025 | 10:15 AM
IND vs NZ: కొదమసింహాల మధ్య కొట్లాటకు సర్వం సిద్ధమవుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ కోసం భారత్-న్యూజిలాండ్ రెడీ అవుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఆఖరాటలో గెలిచిన టీమ్ కప్పుతో స్వదేశానికి బయల్దేరుతుంది.

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌కు సర్వం సిద్ధమైంది. ఆఖరాటకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఈసారి కప్పు ఎగరేసుకుపోవాలని భారత్‌తో పాటు న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఇరు జట్లు ఫైనల్స్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తుదిపోరులో గెలిచి కప్పుతో సగర్వంగా స్వదేశానికి పయనం కావాలని, అభిమానులను సంతోషంలో ముంచెత్తాలని చూస్తున్నాయి. ఫైనల్ ఫైట్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రేపటి మ్యాచ్ టై అయితే ఏంటి పరిస్థితి.. ఇరు జట్ల స్కోర్లు సమమైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
విన్నర్ ఎవరు..
ఒకవేళ ఫైనల్ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ పెడతారు. అందులో కూడా ఫలితం రాకపోతే ఇంకో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇలా రిజల్ట్ వచ్చేంత వరకు, క్లీన్ విన్నర్ ఎవరో తేలేంత దాకా సూపర్ ఓవర్స్ పెడతూనే ఉంటారు. ఏదో ఒక సూపర్ ఓవర్‌లో రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి చాంపియన్ ఎవరు అవుతారనే విషయంలో టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం (మార్చి 10) నాడు తిరిగి మ్యాచ్ కొనసాగిస్తారు.
టెన్షన్ అక్కర్లేదు..
మ్యాచ్ డే అయిన ఆదివారంతో పాటు రిజర్వ్ డే అయిన సోమవారం నాడు కూడా ఆట కోసం అదనంగా 2 గంటలు కేటాయించింది ఐసీసీ. వాన కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే రెండు గంటల పాటు ఎదురు చూస్తారు. ఆదివారం నాడు ఒకవేళ స్కోర్లు టై అయి.. సూపర్ ఓవర్ నిర్వహించే సమయంలో వర్షం పడితే సోమవారం నాడు అదే స్కోర్ల నుంచి ఆటను కంటిన్యూ చేస్తారు. కాబట్టి రిజల్ట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ వరుణుడి బీభత్సంతో మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్-న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అప్పుడు రెండు టీమ్స్ ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
ఫైనల్స్‌లో వర్షం పడితే విన్నర్ ఎవరు..
రోహిత్ కెప్టెన్సీపై కఠిన నిర్ణయం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి