IND vs ENG: ఒకే మ్యాచ్‌తో ఇద్దరు కుర్రాళ్ల డెబ్యూ.. రోహిత్ ప్లాన్ అదిరింది
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:41 PM
Rohit Sharma: లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో కాస్త అటూ ఇటుగా ఉన్నా వన్డేలు, టీ20ల్లో మాత్రం పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుకు పంచ్‌లు ఇస్తుంటాడు హిట్‌మ్యాన్.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో సారథ్యం విషయంలో కాస్త ఇబ్బంది పడినా.. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. మ్యాచ్ కండీషన్స్, సిచ్యువేషన్స్‌ను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ అపోజిషన్ టీమ్స్‌ను పోయిస్తుంటాడు. ప్రత్యర్థులకు ఊహించని విధంగా నాకౌట్ పంచ్‌లు ఇస్తుంటాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో అతడు అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. మొదటి వన్డేలోనే ఇద్దరు కొత్త కుర్రాళ్లకు డెబ్యూ చాన్స్ ఇచ్చాడు. ఆ యంగ్‌స్టర్స్ కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో హిట్‌మ్యాన్ తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. మరి.. ఆ డెబ్యూ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్లాన్ సక్సెస్!
నాగ్‌పూర్ వన్డేలో యువ పేసర్ హర్షిత్ రాణా, యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డెబ్యూ ఇచ్చారు. ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు బదులు హర్షిత్‌ను టీమ్‌లోకి తీసుకున్నాడు రోహిత్. పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయనే వార్తల నేపథ్యంలో హర్షిత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సిరీస్‌లో బాగా ఆడితే బుమ్రా స్థానంలో చాంపియన్స్ ట్రోఫీకి అతడ్ని రీప్లేస్ చేయాలనే ఆలోచనతోనే రోహిత్ ఈ ప్లాన్ వేశాడని తెలుస్తోంది. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో అతడి స్థానంలో జైస్వాల్‌ను ఆడిస్తున్నాడు రోహిత్.
కుమ్మేశారు
అటు హర్షిత్, ఇటు జైస్వాల్.. ఇద్దరూ చాంపియన్స్ ట్రోఫీకి పక్కా వెళ్లే ఆటగాళ్లు కావడంతో సిరీస్‌లో ఎప్పుడో ఒకప్పుడు వారికి అవకాశం ఇవ్వాలి. కానీ రోహిత్ తొలి మ్యాచ్‌లోనే ఆడించి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. హర్షిత్ గురించి పెద్దగా ఐడియా లేకపోవడంతో అతడి బౌలింగ్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు ఔట్ అయ్యారు. అటు జైస్వాల్ ఫీల్డింగ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. వీళ్లు మ్యాచ్ ఆసాంతం ఇదే రకంగా ఆడితే రోహిత్ ప్లాన్ సూపర్బ్‌గా వర్కౌట్ అయినట్లే. అదే సమయంలో చాంపియన్స్ ట్రోఫీ ప్లానింగ్ కూడా విజయవంతం అయినట్లేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. కోహ్లీని కావాలనే ఆడించలేదా.. కారణం ఏంటి
తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..
కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. ఈ ఇన్నింగ్స్ గుర్తుందా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి