Share News

AUS vs WI: ఇది బీచా.. క్రికెట్ స్టేడియమా? వాట్ యాన్ ఐడియా సర్ జీ!

ABN , Publish Date - Jun 27 , 2025 | 02:25 PM

టీ20లు, వన్డే మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు భారీగానే వస్తుంటారు అభిమానులు. కానీ టెస్టులపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకే ఫ్యాన్స్‌ను స్టేడియాలకు రప్పించేందుకు నిర్వాహకులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

AUS vs WI: ఇది బీచా.. క్రికెట్ స్టేడియమా? వాట్ యాన్ ఐడియా సర్ జీ!
Kennington Oval Barbados

క్రికెట్‌ను మొబైల్, టీవీల్లో చూడటం కంటే స్టేడియాల్లో లైవ్‌గా చూస్తే వచ్చే కిక్కే వేరు. ఫేవరెట్ క్రికెటర్స్ ఆటను దగ్గర నుంచి చూస్తుంటే వచ్చే మజా మామూలుగా ఉండదు. అందుకే చాలా మంది తమ దగ్గర్లోని నగరాల్లో గనుక మ్యాచులు జరిగితే స్టేడియాల్లో వాలిపోతుంటారు. చుట్టూ వేలాది మంది అభిమానుల కేరింతలు, డీజే హోరు, చీర్‌గర్ల్స్ జోరు నడుమ మ్యాచ్‌ను చూస్తుంటే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అయితే ఓ స్టేడియం మాత్రం ప్రేక్షకులకు మరో డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. మైదానాన్ని బీచ్‌గా మార్చేసి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ అందించింది. ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Australia vs West Indies


చిల్ అవుతూ..

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. సెషన్ సెషన్‌కూ ఆధిపత్యం మారుతూ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఇరు జట్ల పోరాటాలే కాదు.. మరో ప్రత్యేకతతోనూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు స్టేడియం నిర్వాహకులు. సముద్రానికి చేరువగా ఉన్న ఈ మైదానంలో బౌండరీకి దగ్గరగా ఉండే స్టాండ్స్‌లో బీచ్‌ లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏరియా మొత్తం ఇసుకతో నింపేసి ప్రత్యేకమైన కుర్చీలు పెట్టారు. స్పెషల్ చెయిర్స్‌లో సేదతీరుతూ మ్యాచ్‌ను ఆస్వాదించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Australia vs West Indies


ప్రయోగాలు తప్పనిసరి..

బార్బడోస్ స్టేడియం ఫొటోలు చూసిన నెటిజన్స్.. ఇది మైదానమా? బీచా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మన దగ్గర ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలని.. ప్రేక్షకుల్ని స్టేడియాలకు రప్పించడంపై ఫోకస్ చేయాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. ప్లానింగ్ అదిరింది అంటూ విండీస్ బోర్డును మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది ఆసీస్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు.. 190 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కమిన్స్ సేన.. ఇప్పుడు 4 వికెట్లకు 92 పరుగులతో ఉంది. ఆ జట్టు ఆధిక్యం 82 పరుగులకు చేరుకుంది.


ఇవీ చదవండి:

థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయాలు

హ్యాట్రిక్‌ టైటిళ్లతో భారత్‌ చరిత్ర

టిక్కెట్లు అమ్ముడుపోయాయ్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 02:25 PM