Third Umpire Controversy: వెస్టిండీస్–ఆస్ట్రేలియా మొదటి టెస్ట్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:34 PM
ఓవల్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్–ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఆట వల్ల మాత్రం కాదు. థర్డ్ అంపైర్ (Third Umpire Controversy) ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల వల్ల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.

బార్బడోస్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్–ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆందోళనకర నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారింది. ఆటలో నైపుణ్యం కన్నా, మూడో అంపైర్ ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న వివాదాస్పద (Third Umpire Controversy నిర్ణయాలే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. మ్యాచ్ రెండో రోజు జరిగిన ఘోర తప్పిదాలు ఇటు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, ఆటగాళ్లలో తీవ్ర ఆగ్రహం వచ్చేలా చేశాయి. చివరకు DRS వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి.
చెలరేగిన వివాదం
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 92/4 వద్ద 82 పరుగుల ఆధిక్యంలో ఉన్నప్పటికీ అసలు ఫోకస్ మాత్రం అంపైరింగ్ తప్పిదాలపైనే ఉంది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ LBW అవుతాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతడు 44 పరుగులతో ఆడాడు. వెంటనే రివ్యూ తీసుకోగా అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ మూడో అంపైర్ హోల్డ్‌స్టాక్ దాన్ని పట్టించుకోకుండా వ్యవహరించాడు. ఈ నిర్ణయంపై వెస్టిండీస్ మాజీ పేసర్, ప్రసిద్ధ కామెంటేటర్ ఇయాన్ బిషప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఈ నిర్ణయం చాలా విరుద్ధమని ప్రకటించాడు.
రెండో నిర్ణయం
కొద్ది సేపటికి మరో వివాదాస్పద తీర్పు వెలుగులోకి వచ్చింది. షై హోప్ 48 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా, అతడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి ఎడ్జ్ ఇచ్చినట్టు కనిపించింది. మొదట క్లీన్ క్యాచ్ అయినట్టు అనిపించినా, స్లో మోషన్ రీప్లేలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. అయినా హోల్డ్‌స్టాక్ దానిని క్లీన్ క్యాచ్‌గా ప్రకటించాడు. దీంతో హోప్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అది చూసిన నెటిజన్లు అత్యంత దారుణమైన అంపైరింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు ఫీల్డ్ నుంచి పూర్తిగా వెళ్లిపోవాలని, ఇది పూర్తిగా అవమానకరమని మరొకరు పేర్కొన్నారు.
డే 1 నుంచే తప్పుడు తీర్పులు
ఈ వివాదం రెండో రోజు మొదలుకాలేదు. మొదటి రోజు ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఔట్ అయినట్టు వీడియోల్లో కనిపించినా, బంతి వికెట్ కీపర్ చేతికి నేరుగా వెళ్లినట్టు స్పష్టంగా కనిపించినా హోల్డ్‌స్టాక్ సాక్ష్యాలు సరిపోవని నాట్-ఔట్‌గా ప్రకటించాడు. ఈ తీర్పులు క్రికెట్ న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. దీనిపై ఐసీసీ వెంటనే జోక్యం చేసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో కూడా అంపైర్ తప్పుగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
భారత్ రెండో టెస్టుకు కుల్దీప్ యాదవ్.. మైఖేల్ క్లార్క్ సంచలన
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి