టిక్కెట్లు అమ్ముడుపోయాయ్
ABN , Publish Date - Jun 27 , 2025 | 05:55 AM
క్రికెట్ ఆడే దేశాలలో టీమిండియాకున్న క్రేజ్ చెప్ప నలవి కాదు..ఏ దేశంలో పర్యటించినా భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తుతారు....

నవంబరులో ఆస్ట్రేలియా గీభారత్ సిరీస్
సిడ్నీ: క్రికెట్ ఆడే దేశాలలో టీమిండియాకున్న క్రేజ్ చెప్ప నలవి కాదు..ఏ దేశంలో పర్యటించినా భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తుతారు. దటీజ్ టీమిండియా. ఇకపోతే ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సకోసం వచ్చే అక్టోబరు-నవంబరులో భారత జట్టు ఆ దేశంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడనున్నాయి. సిరీ్‌సలో మూడో వన్డే (అక్టోబరు 25)కు సిడ్నీ, తొలి టీ20 (అక్టోబరు 29)కి కాన్‌బెరా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను అమ్మకానికి పెట్టగా..హాట్ కేకుల్లా అభిమానులు కొనేశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం వెల్లడించింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి