Team India: కోచ్‌తో టీమిండియా క్రికెటర్ల కొట్లాట.. గంభీర్ ముందే..!
ABN , Publish Date - Jun 28 , 2025 | 07:47 PM
లీడ్స్ టెస్ట్‌లో ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. దీనికి అంతకంతా పగ తీర్చుకోవాలని చూస్తోంది. రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది.

టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో ఇద్దరు పేసర్లు గొడవకు దిగారు. లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మరో పేసర్ ఆకాశ్‌దీప్ ఫైట్ చేశారు. తొలుత అర్ష్‌దీప్‌ను మోర్కెల్ రెచ్చగొట్టాడు. అతడ్ని కిందపడేసి కాళ్లతో బంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. అయితే ఎలాగోలా విడిపించుకున్న అర్ష్‌దీప్.. ఆకాశ్‌దీప్ సాయంతో మోర్కెల్‌ను కింద పడేశాడు. అయినా శక్తినంతా కూడదీసుకొని పైకి లేచిన మోర్కెల్.. మరోసారి అర్ష్‌దీప్ పైకి దూకాడు.
పైన కూర్చొని..
అర్ష్‌దీప్ మీద కూర్చొని అతడి చేతులు పైకి అదిమిపెట్టి.. చక్కిలిగింతలు పెట్టాడు మోర్కెల్. అదేంటి మొదట కొట్టుకున్న కోచ్-క్రికెటర్లు ఆ తర్వాత చక్కిలిగింతలు పెట్టుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా? అయితే ఇది రియల్ ఫైట్ కాదు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్లు అర్ష్‌దీప్, ఆకాశ్‌దీప్‌తో ప్రాక్టీస్ చేయించాడు బౌలింగ్ కోచ్ మోర్కెల్. ఆ తర్వాత వీళ్లు కాసేపు అక్కడే సేదతీరారు. అదే సమయంలో కోచ్ వాళ్లిద్దరితో డబ్ల్యూడబ్ల్యూఈ తరహా రెజ్లింగ్ చేస్తూ ఆటపట్టించాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కోచ్ గంభీర్ నేతృత్వంలో ఒకవైపు ప్రాక్టీస్ సెషన్ నడుస్తున్న సమయంలో మోర్కెల్-పేసర్లు మరోవైపు ఫన్నీ ఫైట్‌కు దిగడం వైరల్‌గా మారింది.
ఎంట్రీ పక్కా..
రెండో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ను దించుతున్నారని తెలుస్తోంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లో ఆకాశ్‌దీప్‌ను ఆడించనున్నారని వినిపిస్తోంది. ఆకాశ్‌దీప్ ఆడినా ఆడకపోయినా అర్ష్‌దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం మాత్రం పక్కా అని సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ కావడంతో బౌలింగ్ యూనిట్‌లో వైవిధ్యత వస్తుంది, అదే సమయంలో స్వింగ్ డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులు పెట్టొచ్చనే ఉద్దేశంతో అతడ్ని తుదిజట్టులోకి తీసుకునేందుకు గంభీర్-గిల్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి