Share News

Travis Head: కాటేరమ్మ కొడుకు కొత్త చరిత్ర.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..!

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:38 PM

కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Travis Head: కాటేరమ్మ కొడుకు కొత్త చరిత్ర.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..!
Travis Head

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అదరగొట్టిన హెడ్.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌‌లో 59 పరుగులు చేసిన స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. లోస్కోరింగ్ గేమ్‌లో రెండు హాఫ్ సెంచరీలు బాదడంతో హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు హెడ్.

Travis-Head.jpg


తొలి ఆటగాడిగా..

విండీస్‌పై గెలుపులో ముఖ్య భూమిక పోషించడంతో పీవోటీఎం అందుకున్నాడు హెడ్. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అతడికి ఇది 10వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం. తద్వారా డబ్ల్యూటీసీ హిస్టరీలో అత్యధిక పీవోటీఎం అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా, 10 పీవోటీఎం పురస్కారాలు దక్కించుకున్న మొదటి క్రికెటర్‌గా హెడ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో హెడ్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (5 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు), స్టార్ బ్యాటర్ జో రూట్ (5 పీవోటీఎంలు), అదే దేశానికి చెందిన యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (4 పీవోటీఎంలు) ఉన్నారు. కాగా, విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 159 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది కమిన్స్ సేన. జోష్ హేజల్‌వుడ్ (5/43), నాథన్ లయన్ (2/20) దెబ్బకు చేజింగ్‌లో కరీబియన్ జట్టు కుప్పకూలింది.

aus vs wi


ఇవీ చదవండి:

ప్రమాదంలో గంభీర్ పదవి

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌

మనమ్మాయిలకు భలే చాన్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 03:41 PM