Shikar Dhawan: ప్రేయసిని రూమ్‌కు తీసుకొచ్చిన ధవన్.. రూమ్మేట్ అయిన రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:32 AM
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన ఆత్మకథను 'ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోరు' పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకంలో ధవన్ ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా తాను భారత్-ఎ జట్టుకు ఆడే సందర్భంలో రోహిత్ శర్మతో ఎదురైన అనుభవం గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikar Dhawan) తన ఆత్మకథను 'ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్' పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకంలో ధవన్ ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా తాను భారత్-ఎ జట్టుకు ఆడే సందర్భంలో రోహిత్ శర్మ (Rohit sharma)తో ఎదురైన అనుభవం గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. 2006లో భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో ధవన్‌కు, రోహిత్‌కు హోటల్‌లో ఒకే గదిని కేటాయించారు.
అప్పటికే ప్రేమలో ఉన్న ధవన్ తన హోటల్ గదికి ప్రేయసిని తీసుకొచ్చేవాడట (Shikar Dhawan Lover). తన ప్రేయసి గురించి కూడా ధవన్ రాసుకొచ్చాడు. 'ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఆమెతో ప్రేమలో పడ్డా. ఆమె నా కోసమే పుట్టిందని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నా అని అనుకునేవాడిని. ఆ పర్యటనలో ఓ హఫ్ సెంచరీ కూడా సాధించా. అంతా సాఫీగా సాగిపోతుండేది. ప్రతి మ్యాచ్ తర్వాత ఆమెను కలిసేవాడిని. ఆమెను నా హోటల్ గదికి కూడా తీసుకురావడం ప్రారంభించా. అప్పుడు నా రూమ్మేట్ రోహిత్ శర్మ. ఆమె వచ్చినప్పుడుల్లా రోహిత్ ఇబ్బందిగా ఫీలయ్యేవాడు' అని ధవన్ రాశాడు.
ధవన్ తన ప్రేయసిని హోటల్ గదికి తీసుకొస్తే రోహిత్.. 'నన్ను నిద్రపోనిస్తావా, లేదా' అని అడిగేవాడట. అయినా ధవన్ మాత్రం ఆమెను హోటల్‌కు తీసుకొస్తూనే ఉండేవాడట. ఒక రోజు ధవన్ తన ప్రేయసితో కలిసి నడుస్తుండగా జట్టు మొత్తం చూసేసిందంట. ఓ సీనియర్ సెలక్టర్ కూడా చూశాడట. అయినా ధవన్ ఆమె చేతులను విడవలేదట. తామేం తప్పు చేయలేదనే భావనతో ఉండడం వల్లే అంత ధైర్యంగా ఆమెతో కలిసి తిరిగేవాడట. ధవన్ తన ఆత్మకథలో రాసిన ఈ విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి