Gautam Gambhir: గంభీర్ పదవి ప్రమాదంలో ఉంది.. ఇంగ్లండ్ సిరీస్ గెలవలేకపోతే..: ఆకాష్ చోప్రా
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:08 PM
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర వైఫల్యాలు ఎదుర్కొంది. భారత జట్టు ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా ఏడింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైంది. టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి తీవ్రమవుతోంది.

గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్‌గా పని చేసి టైటిల్ గెలవడంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక పాత్ర పోషించాడు. దీంతో బీసీసీఐ (BCCI) అతడిని టీమిండియాకు హెడ్ కోచ్‌గా నియమించింది. అతడు అడిగిన అన్నింటినీ సమకూర్చింది. అతడు అడిగిన సహాయక సిబ్బందిని ఇవ్వడంతో పాటు ఎన్నో సౌకర్యాలు అందించింది. అయితే గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా (TeamIndia) ఘోర వైఫల్యాలు ఎదుర్కొంది. భారత జట్టు ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా ఏడింట్లో ఓడిపోయింది.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైంది. టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి తీవ్రమవుతోంది. మాజీ ఆటగాళ్లు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరో మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా (Aakash Chopra) కూడా గంభీర్ పరిస్థితిపై వ్యాఖ్యానించాడు. 'మేనేజ్‌మెంట్, కోచ్ కోరుకున్నట్టే సెలక్టర్లు వ్యవహరించారు. వారు అడిగిన ఆటగాళ్లనే జట్టులోకి ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు సిరీస్‌లో ఫలితాలు అనుకూలంగా రాకుంటే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు' అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.
'గంభీర్ మీద చాలా ఒత్తిడి ఉంది. అతడి ఆధ్వర్యంలో టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా రాణించలేకపోతే గంభీర్ ప్రధాన కోచ్ పదవిని సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో జట్టు కూర్పు, వ్యూహాల గురించి గంభీర్ సమాలోచనలు చేసుకోవాలి' అని ఆకాష్ చోప్రా సూచించాడు.
ఇవీ చదవండి:
పాక్‌తో మ్యాచ్.. బయటకు రానివ్వలేదు..
ప్రేయసితో రూమ్‌కు ధవన్.. రోహిత్ ఏమన్నాడంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి