Share News

Cricketer Allegations: విండీస్‌ స్టార్‌ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:52 AM

ప్రస్తుత వెస్టిండీస్‌ జట్టులోని ఓ స్టార్‌ క్రికెటర్‌ లైంగిక ఆరోపణల వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులు, అత్యాచారం తదితర ఆరోపణలతో ఓ మైనర్‌ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై గయానా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు విండీస్‌ మీడియా పేర్కొంది.

Cricketer Allegations: విండీస్‌ స్టార్‌ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

  • మైనర్‌ సహా 11 మంది మహిళలు ఫిర్యాదు చేసినట్టు కథనాలు

గయానా: ప్రస్తుత వెస్టిండీస్‌ జట్టులోని ఓ స్టార్‌ క్రికెటర్‌ లైంగిక ఆరోపణల వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులు, అత్యాచారం తదితర ఆరోపణలతో ఓ మైనర్‌ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్‌పై గయానా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు విండీస్‌ మీడియా పేర్కొంది. స్థానిక పత్రిక కథనం ప్రకారం.. 2023 మార్చిలో న్యూఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని ఓ నివాసంలో ఆ క్రికెటర్‌ తనపై లైంగిక దాడి చేశాడని 18 ఏళ్ల యువతితో పాటు ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో మరికొందరు మహిళలు కూడా ఆ క్రికెటర్‌పై ఇవే ఆరోపణలు చేశారు. క్రికెటర్‌ చేసిన వాట్సాప్‌ సందేశాలు, వాయిస్‌ నోట్స్‌ లాంటి ఆధారాలను పోలీసులకు అందజేశారు. కానీ, ఇప్పటిదాకా ఆ ఆటగాడిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదు. గతేడాది జనవరిలో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గెలిచిన విండీస్‌ జట్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ ఉన్నాడని మీడియా వెల్లడించింది. ఆసీ్‌సపై విజయం అనంతరం గయానాకు తిరిగొచ్చినప్పుడు అతనికి ఘనంగా స్వాగతం కూడా పలికారని తెలిపింది. కాగా, ఆ ఆరోపణల విషయంపై తమకు పూర్తిగా తెలియదనీ, దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించలేమని విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

Updated Date - Jun 28 , 2025 | 04:54 AM