Share News

Harpreet Brar: టీమిండియాలోకి కుర్ర స్పిన్నర్.. ఎవరికీ తెలియకుండా..!

ABN , Publish Date - Jun 28 , 2025 | 06:12 PM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు ఓ కుర్ర స్పిన్నర్‌ను రంగంలోకి దించింది భారత్. సైలెంట్‌గా అతడ్ని ప్రాక్టీస్ క్యాంప్‌లో చేర్చింది. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

Harpreet Brar: టీమిండియాలోకి కుర్ర స్పిన్నర్.. ఎవరికీ తెలియకుండా..!
Harpreet Brar

లీడ్స్ టెస్ట్‌లో అనూహ్య ఓటమి టీమిండియాను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత్ తరఫున ఏకంగా 5 సెంచరీలు నమోదైనా పరాజయం పాలవడం అభిమానుల్ని కూడా షాక్‌కు గురిచేసింది. బౌలర్ల వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు జట్టు కొంపముంచాయి. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్ట్‌‌లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది గిల్ సేన. ఇంగ్లండ్ బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఓ యువ స్పిన్నర్‌ను సైలెంట్‌గా దింపిందని తెలుస్తోంది. మరి.. ఆ స్పిన్నర్ ఎవరు? అతడ్ని ఎందుకు ఇంగ్లండ్‌కు తీసుకొచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం..


బౌలింగ్ వేస్తూ..

పంజాబ్ కింగ్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ టీమిండియా నెట్ సెషన్‌లో దర్శనమిచ్చాడు. బర్మింగ్‌హామ్‌లో తాజాగా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్రార్ బౌలింగ్ వేస్తూ కనిపించాడు. భారత ఆటగాళ్లంతా బ్లూ జెర్సీలో ప్రాక్టీస్ చేయగా.. బ్రార్ మాత్రం నలుపు రంగు దుస్తుల్లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. టీమిండియా నెట్స్‌లో బ్రార్ పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. 2022లో కూడా ఇలాగే ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేశాడు.


కారణం ఏంటి..

తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టులో షోయబ్ బషీర్ రూపంలో ఒకే ప్రధాన స్పిన్నర్ ఆడాడు. రెండో స్పిన్నర్‌గా జో రూట్ కొన్ని ఓవర్లు వేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం ప్రకటించిన స్క్వాడ్‌లోనూ కొత్తగా ఏ స్పిన్నర్ రాలేదు. అందునా ఎడమ చేతితో బంతిని టర్న్ చేసేవారు అసలే లేరు. అలాంటప్పుడు హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో మన బ్యాటర్లు ఎందుకు సాధన చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవేళ లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే.. ఆల్రెడీ జడేజా, కుల్దీప్ రూపంలో ఇద్దరు ఎడమ చేతి వాటం స్పిన్నర్లు టీమ్‌లో ఉన్నారు. మరి.. బ్రార్‌ను ఎందుకు రప్పించారు? అతడి బౌలింగ్‌లో ఎందుకు సాధన చేస్తున్నారనేది టీమ్ మేనేజ్‌మెంట్‌ బయటపెడుతుందేమో చూడాలి. కాగా, దేశవాళీలతో పాటు ఐపీఎల్‌లో అదరగొడుతున్న బ్రార్.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు.


ఇవీ చదవండి:

కాటేరమ్మ కొడుకు కొత్త చరిత్ర

ప్రమాదంలో గంభీర్ పదవి

మనమ్మాయిలకు భలే చాన్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 06:14 PM