Viral Video: వామ్మో.. వీళ్లేంట్రా బాబోయ్.. కొండచిలువను ముక్కలుగా కోసి.. కేకుల్లా..
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:04 AM
పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొందరు వాటితో ఆడుకుంటుంటుంటే.. మరికొందరు పాములను ఏకంగా నోట్లో పెట్టుకోవడం, నడుముకు చుట్టుకోవడం కూడా చూస్తుంటాం. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాటిని తమ పక్కనే పడుకొబెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే ..

పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొందరు వాటితో ఆడుకుంటుంటుంటే.. మరికొందరు పాములను ఏకంగా నోట్లో పెట్టుకోవడం, నడుముకు చుట్టుకోవడం కూడా చూస్తుంటాం. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాటిని తమ పక్కనే పడుకొబెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు ఏకంగా కొండచిలువను ముక్కలుగా కోసి, కేక్‌లా ఆరగించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అది కొండచిలువ అనుకున్నారా.. కేక్ అనుకున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అటవీ తెగకు చెందిన కొందరు కొండచిలువను ముక్కలుగా కోసి తినడం చూసి అంతా అవాక్కవుతున్నారు. అడవిలో గుంపులుగా ఉన్న వారు... కొండచిలువను చిన్న చిన్న ముక్కలుగా కోశారు. ఒక్కొక్కరు ఒక్కో ముక్కను పట్టుకుని, (Tribals eating python) కేక్ తరహాలో కొరికి తింటున్నారు.
Pakistan Viral Video: పాకిస్థాన్‌లో స్కానింగ్ ఎలా చేస్తారో తెలుసా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
వారిలో ఓ మహిళ వీడియో తీస్తుండగా.. మిగతా వారంతా కెమెరాకు ఫోజులు ఇస్తూ కొండచిలువను తినేస్తున్నారు. వారిలో చిన్న చిల్లలు కూడా ఏమాత్రం భయం లేకుండా కొండచిలువను పచ్చిగానే తినడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరు పాపువా న్యూగినియా తెగకు చెందిన వారని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: బైకు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అంతే.. ఇతడికేమైందో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. అది కొండచిలువ అనుకున్నారా... లేక కేక్‌లు అనుకున్నారా’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ ముక్కల్లో సాస్ కలుపుకోవడం మర్చిపోయినట్టున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 23 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు.. చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..