Father and Daughter Love: తండ్రి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి.. కూతురు తన ప్రేమను వ్యక్తం చేయగానే..
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:48 PM
ఓ తండ్రి తన కూతురు రైలు ఎక్కించడానికి వచ్చాడు. కూతురు రైలు ఎక్కినా కూడా అక్కడే నిలబడి చూస్తున్నాడు. రైలు బయలుదేరే ముందు కూతురు తన తండ్రికి బాయ్.. నాన్నా అని చెబుతుంది. అందుకు ఆ తండ్రి కూడా వీడ్కోలు చెప్పాడు. అయితే ఈ సందర్భంలో..
పిల్లలను కంటికి రెప్పలా కాపాడడంలో తండ్రి పాత్ర కీలకం. తన పిల్లల సంతోషం కోసం తన సంతోషాలను త్యాగం చేసుకుంటాడు తండ్రి. పిల్లలు పెరిగి పెద్దవారైనా.. వారిని ఎప్పటికీ చిన్నపిల్లల్లాగానే చూస్తూ అదే ప్రేమను కనబరుస్తుంటాడు. తండ్రి ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించే వీడియోలు.. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ తండ్రి తన కూతురును రైలు ఎక్కించి వీడ్కోలు పలికాడు. వెళ్లే సమయంలో ఆమె తన తండ్రి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ చేత్తో సింబల్ చూపించడంతో.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ తండ్రి తన కూతురు రైలు ఎక్కించడానికి వచ్చాడు. కూతురు రైలు ఎక్కినా కూడా అక్కడే నిలబడి చూస్తున్నాడు. రైలు బయలుదేరే ముందు కూతురు తన తండ్రికి బాయ్.. నాన్నా అని చెబుతుంది. అందుకు ఆ తండ్రి కూడా వీడ్కోలు చెప్పాడు. అయితే ఈ సందర్భంలో ఆ కూతురు తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. కొరియన్ స్టైల్లో రెండు వేళ్లను హార్ట్ సింబల్ ఆకారంలో చూపించింది.
కూతురు అలా చేయి చూపించగానే తండ్రికి.. ఆమె తనను డబ్బులు అడుగుతున్నట్లు అనిపించింది. కూతురు అలా చేయి చూపించగానే.. ఆ తండ్రి తన జేబులో నుంచి డబ్బులు బయటికి తీశాడు. అందులో నుంచి రూ.500లు తీసుకుని, (Father gives Rs.500 to daughter) కూతురుకు ఇచ్చాడు. పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో ఎలాగైతే తండ్రి ఎలాగైతే డబ్బులు ఇస్తాడో.. ఇక్కడ ఈ తండ్రి కూడా తన కూతురుకు డబ్బులు ఇచ్చాడు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ తెగ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘తండ్రి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది మరి’.. అంటూ కొందరు, ‘నిస్వార్థమైన ప్రేమ అంటే ఇదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58 లక్షలకు పైగా లైక్‌లు, 73 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..
పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి