Share News

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..

ABN , Publish Date - Mar 17 , 2025 | 09:40 AM

గుండెలకు హత్తుకునే సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చలనం లేకుండా పడిఉన్న ఏనుగును మరో ఏనుగు లేపేందుకు పడిన తాపత్రయం అందరి మనసులనూ కదిలిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. .

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..

ఏనుగులు చూసేందుకు ఎంత గంభీరంగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో ప్రేమనురాగాలు కూడా కురిపిస్తుంటాయి. సాటి ఏనుగు కష్టాల్లో ఉంటే తట్టుకోలేవు. కొన్నిసార్లు వాటి ప్రాణాలను ఫణంగా పెట్టి తమ స్నేహితులను రక్షించుకుంటుంటాయి. గుండెలకు హత్తుకునే ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చలనం లేకుండా పడిఉన్న ఏనుగును మరో ఏనుగు లేపేందుకు పడిన తాపత్రయం అందరి మనసులనూ కదిలిస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రష్యాలో (Russia) చోటు చేసుకుంది. స్థానికంగా నిర్వహించే సర్కస్‌లో (Circus) మాగ్డా, జెన్నీ అనే ఏనుగులు ఎంతో ఫేమస్. సుమారు 25 ఏళ్లుగా ఈ రెండు ఏనుగులు సర్కస్‌లో విన్యాసాలు చేస్తూ అందరినీ అలరించాయి.

Komodo dragon Viral Video: గేదెపై కొమొడో డ్రాగన్ దాడి.. సమీపానికి వెళ్లగా షాకింగ్ ట్విస్ట్.. చివరకు..


అయితే ఇటీవల జెన్నీ అనే ఏనుగు అనారోగ్య కారణాలతో చనిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న జెన్నీ వద్దకు వచ్చిన మాగ్డా కాసేపు గమనిస్తూ ఉండిపోయింది. తన స్నేహితుడు ఎంతకీ నిద్రలేవకపోవడంతో తొండంతో అటూ, ఇటూ కదుపుతూ లేపేందుకు ప్రయత్నించింది. అయినా జెన్నీ నిద్రలేవకపోవడంతో కాళ్లతో కదిలించి కూడా చూసింది. అయినప్పటికీ జెన్నీలో చలనం లేకపోవడంతో మాగ్డా తట్టుకోలేకపోయింది. తన సహచరుడిపై తొండం పెట్టి (Elephant standing sadly next to dead elephant) బాధగా నిలబడిపోయింది. ఇలా కొన్ని గంటల పాటు ఆ ఏనుగు తన స్నేహితుడి కళేబరం వద్దే నిలబడి తన బాధను వ్యక్తం చేసింది.

Lions Viral Video: బైకర్‌కు ఎదురెళ్లిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని షాక్..


ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగును చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘స్నేహమంటే ఇలా ఉండాలి.. ఈ ఏనుగును అంతా ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 09:40 AM