Viral Video: మరణం ఎదురవడమంటే ఇదేనేమో.. వీడియో చూస్తే గూజ్‌బమ్స్ ఖాయం..
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:11 PM
ఓ ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని వేగంగా వెళ్తుంటుంది. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అటోకు ఎదురుగా ఓ బస్సు వస్తుంటుంది. అయితే దాని వెనుక మరో బస్సు అత్యంత వేగంగా వస్తుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..

ప్రయాణ సమయాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ఊహించని ప్రమాదం ముంచుకొస్తే.. మరికొన్నిసార్లు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా తయారువుతుంటుంది. ఇంకొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు సైతం త్రుటిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఆటో వేగంగా వెళ్లుండగా.. ఎదురుగా మరింత వేగంతో ఓ బస్సు దూసుకొచ్చింది. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మరణం ఎదురవడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని వేగంగా వెళ్తుంటుంది. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అటోకు ఎదురుగా ఓ బస్సు వస్తుంటుంది. అయితే దాని వెనుక మరో బస్సు అత్యంత వేగంగా వస్తుంది.
Monkey Viral Video: కాళ్లు తడవకుండా కాలువ దాటేదెలా.. ఈ కోతి చేసిన పని చూస్తే..
ముందు వెళ్తున్న బస్సు ఓవర్ టేక చేసి ఆటోకు (bus coming in front of auto) ఎదురుగా వస్తుంది. బస్సు ఎదురుగా రావడం చూసి ఆటో డ్రైవర్.. వాహనాన్ని సడన్‌గా రోడ్డు పక్కకు తీసుకెళ్తాడు. బస్సు అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిపోతుంది. ఆ క్షణంలో ఒక్క అంగుళం అటూ, ఇటూ అయినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు.
Viral Video: ఇస్త్రీ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రైవర్ ఖచ్చితంగా గుజరాతీ అయ్యుంటాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇతడికి యుముడితో మంచి సాన్నిహిత్యం ఉన్నట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300 కి పైగా లైక్‌లు, 1.48 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..