Share News

Viral Video: వీటినీ మడత పెట్టొచ్చు.. మూడు ఫోన్లను ఎలా సెట్ చేశాడో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 15 , 2025 | 08:30 PM

ఇంట్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలను చేసే వారిని తరచూ చూస్తుంటాం. టేబుల్ ఫ్యాన్, పాత బైకు ఇలా అనేక వస్తువులపై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. తాజగా ఓ వ్యక్తి ఫోన్లతో చేసిన విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఫోన్ కంపెనీలకే షాక్ ఇచ్చాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Viral Video: వీటినీ మడత పెట్టొచ్చు.. మూడు ఫోన్లను ఎలా సెట్ చేశాడో చూస్తే.. షాకవ్వాల్సిందే..

‘‘నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిదీ ఆ రూట్లో నే నడిచెదరో’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా.. చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తుంటారు. కొన్ని పనులను అంతా ఒకేలా చేస్తే.. కొందరు మాత్రం చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ఫోన్లతో చేసిన విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఫోన్ కంపెనీలకే షాక్ ఇచ్చాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. చిన్నా పెద్దా ఇలా ప్రతి ఒక్కరి వద్దా ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కంపెనీలు వివిధ రకాల మోడళ్లలో ఫోన్లను తీసుకురావడం చూస్తుంటాం.

Viral Snake Video: కుర్చీలో కూర్చున్న పిల్లాడు.. పక్కనే పడుకున్న పాము.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


మడత పెట్టే స్మార్ట్ ఫోన్లు (Foldable smartphones) కూడా మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఓ వ్యక్తి మడత పెట్టే ఫోన్‌ కొనే కంటే తానే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ఫోన్లను తీసుకున్నాడు. వాటికి తలుపులకు అమర్చే హింగ్‌లను ఫిట్ చేశాడు. రెండు డోర్ హింగ్‌లను (Door Hing) తీసుకుని మూడు ఫోన్లను ఫిట్ చేశాడు. ఫైనల్‌గా ఆ మూడు ఫోన్లను మడతపెట్టేందుకు వీలుగా సెట్ చేశాడు.

Couple Viral Video: అందరి మనసూ దోచుకున్నారుగా.. రైల్లో ఈ దంపతులు చేస్తున్న పని చూస్తే..


ఇలా మూడు ఫోన్లతో విచిత్రమైన ప్రయోగం చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ కంపెనీలకే షాక్ ఇచ్చాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్‌ ఇండియాలో సాధ్యం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2025 | 08:33 PM