Share News

Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:27 PM

ఓ యువకుడు, యువతి.. కుక్కలకు ఆహారం పెడుతుంటారు. వారి వెనుకే ఓ కుక్క పడుకుని ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Dogs Viral Video: కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే.. యువతి కిండపడడం చూసి..

విశ్వాసం అంటేనే వెంటనే కుక్కలు గుర్తుకొస్తాయి. ఒక్క ముద్ద అన్నం తిన్నా కూడా సదరు వ్యక్తులపై జీవితాంతం కృతజ్ఞత చూపిస్తంటాయి. వారికి ప్రమాదం ఉందని తెలిస్తే.. తమ ప్రాణాలను ఫణంగా పెడుతుంటాయి. తమ యజమానికి చిన్న సమస్య తలెత్తినా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. యువతి కింద పడడం చూసి కుక్కలు చుట్టూ చేరాయి. వాటి నిర్వాకం చూసి నెటిజన్లు.. ‘‘కుక్కలకు మానవత్వం కూడా ఎక్కువే’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో చాలా కుక్కలను పెంచుతుంటారు. ఓ యువకుడు, యువతి.. కుక్కలకు (dogs) ఆహారం పెడుతుంటారు. వారి వెనుకే ఓ కుక్క పడుకుని ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కుక్క పిల్లకు ఆహారం పెడుతున్న యువతి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

Optical illusion: మీ చూపు చురుగ్గానే ఉందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


వెనక్కు తిరిగి రెండు అడుగులు వేయగానే కింద పడుకుని ఉన్న కుక్కకు కాలు తగులుకుని (young woman fell down) ధబేల్‌మని కిందపడిపోతుంది. దెబ్బ గట్టిగా తగలడంతో యువతి నొప్పితో ఇబ్బందిపడుతుంటుంది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తిని ఆమెతో మాట్టాడుతుంటాడు. యువతి కిందపపడం చూసి అక్కడున్న కుక్కలన్నీ వరుసగా ఆమె వద్దకు వస్తాయి. ‘‘ఎలా ఉంది మేడం.. ఏమైనా దెబ్బలు తగిలాయా’’.. అన్నట్లుగా తమ యజమానిని పరామర్శిస్తాయి.

Tiger Viral Video: రీల్స్ చూస్తున్న యువకుడు.. మంచం వద్దకు వచ్చిన పులి.. చివరకు చూస్తే..


కుక్కల ప్రేమను చూసి వారిద్దరూ భావోద్వేగానికి గురవుతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల్లోనే మానవత్వం కుక్కల్లో చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్కల ప్రేమ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌‌లు, 61 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2025 | 03:27 PM