Share News

Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:50 PM

ఓ వ్యక్తి చేతిలో ఓ పాలిథిన్ కవర్‌తో మెట్రో రైలు ఎక్కాడు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేకున్నా కూడా.. లోపల కూర్చున్న తర్వాత అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సీట్లో కూర్చున్న అతను.. చివరికి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

శుభ్రంగా ఉన్న ప్రాంతాలు కొన్నిసార్లు ఆకతాయిల వల్ల అధ్వానంగా తయారవుతుంటాయి. కొందరు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బస్సు, రైళ్లతో పాటూ విమానాలను కూడా అపరిశుభ్రం చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి మెట్రో రైల్లో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మెట్రోను కూడా బస్టాండ్‌లా మార్చావు కదరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతిలో ఓ పాలిథిన్ కవర్‌తో మెట్రో రైలు ఎక్కాడు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేకున్నా కూడా.. లోపల కూర్చున్న తర్వాత అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సీట్లో కూర్చున్న అతను కవర్ తెరిచి, అందులోని వేరుశెనగ కాయలను తినడం స్టార్ట్ చేశాడు.

Viral Video: ఏసీ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని తెరచి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..


అంతా విచిత్రంగా చూస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా (Man eating peanuts on metro train) కాయలను ఒలిచి విత్తనాలను తింటూ వ్యర్థాలను కింద చెల్లాచెదురుగా పడేస్తున్నాడు. ఇలా చూస్తుండగానే కవర్‌లోని వేరుశెనగలు మొత్తం తిని వ్యర్థాలన్నింటినీ కింద పడేశాడు. ఇతడి నిర్వాకం చూసి మిగతా ప్రయాణికులంతా అవాక్కయ్యారు. అయినా ఎవరూ అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు.

Crow Viral Video: వరుసగా మాయమవుతున్న దుస్తుల హ్యాంగర్లు.. చివరకు మేడపై కాకి నిర్వాకం చూసి అంతా షాక్..


అయితే చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చివరికి మెట్రోను కూడా బస్టాండ్ చేసేశావు కదరా’’.. అంటూ కొందరు, ‘‘అది అతడి తప్పు కాదు.. చూసే వారి తప్పు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 90 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Viral Video: కక్కుర్తిలో పరాకాష్ట అంటే ఇదే.. రైల్లో ఇతడి నిర్వాకం చూస్తే.. అవాక్కవుతారు..


షార్ట్ వీడియోను ఇక్కడ చూడండి..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2025 | 03:50 PM