Viral Funny Video: ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమే.. ఎలా లాక్ చేశాడో చూస్తే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 07:13 AM
ఓ వ్యక్తి తన జేబులోని డబ్బులను దొంగలు కొట్టేయకుండా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నాడు. అందరిలా కాకుండా విచిత్రంగా ఆలోచిస్తూ వింత ఏర్పాట్లు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘జేబుకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఇంట్లోని వస్తువులు దొంగలు కొట్టేయకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటాం. కొందరు తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొందరు తీసుకునే జాగ్రత్తలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు తీసుకునే ముందు జాగ్రత్తలు చూస్తే నవ్వొచ్చేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి తమాషా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన జేబులోని డబ్బులు ఎవరూ కొట్టేయకుండా తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘జేబుకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన జేబులోని డబ్బులను దొంగలు కొట్టేయకుండా పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నాడు. అందరిలా కాకుండా విచిత్రంగా ఆలోచిస్తూ వింత ఏర్పాట్లు చేశాడు. తలుపు అమర్చే గొళ్లాన్ని తీసుకుని.. జేబుకు ఫిట్ చేశాడు.
Marriage Viral Video: చచ్చినట్లు ఇవ్వాల్సిందే.. ఈ వరుడు బంధువులను భలే ఇరికించాడుగా..
డబ్బులను జేబులో పెట్టిన తర్వాత (Man locked his pocket) గొళ్లెం పెట్టి, దానికి తాళం వేశాడు. తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇలా దొంగలు తన జేబులోని డబ్బులను కొట్టేయకుండా వింత ఏర్పాట్లు చేసుకున్నాడన్నమాట. గతంలో చాలా మంది ఇలాంటి విచిత్రమైన ఏర్పాట్లు చేయడం చూశాం. ఓ వ్యక్తి తన కూలర్‌ను ఎవరూ ఎత్తుకెళ్లకుండా ఏకంగా గోడ మధ్యలో ఫిట్ చేశాడు, అలాగే మరో వ్యక్తి తన కారుకు ముళ్ల కంచె వేయడం చూశాం. అదేవిధంగా ఇంకో వ్యక్తి తన బైక్ టైరుకు లాక్ చేయడం కూడా చూశాం.
Viral Video: వీటినీ మడత పెట్టొచ్చు.. మూడు ఫోన్లను ఎలా సెట్ చేశాడో చూస్తే.. షాకవ్వాల్సిందే..
తాజాగా, జేబుకు తాళం వేసిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ జేబును కొట్టేయడం ఎవరి తరమూ కాదేమో’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..