Rammohan Naidu: జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:18 PM
ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
ఢిల్లీ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు. జీపీఎస్ స్పూఫింగ్‌తో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.
సంప్రదాయ నావిగేషన్ సహాయంతో రన్‌వేను ఆపరేట్ చేశారని వివరించారు. కోల్‌కతా, అమృత్‌సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో కూడా జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు రిపోర్ట్స్ వచ్చాయని గుర్తుచేశారు. గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించి గ్రౌండ్ బేస్ నావిగేషన్ ఉపయోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. విమానాల రంగంలో మాల్వేర్ ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నాయని.. అడ్వాన్స్‌డ్ సైబర్ సెక్యూరిటీ ద్వారా ఈ దాడులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు రక్షణాత్మక విధానాల ద్వారా సైబర్ దాడులను అధిగమిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి