Share News

Supreme Court: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:22 PM

బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Supreme Court: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి.. ఎందుకంటే..
Supreme Court

ఢిల్లీ: బెట్టింగ్ యాప్‌లను (Betting Apps) నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల (ఆగస్టు) 18వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


కేంద్రప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. బెట్టింగ్ యాప్‌ల నిషేధాన్ని కేంద్రం సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందో చూద్దామని సుప్రీంకోర్టు చెప్పింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు కేఏ పాల్. బెట్టింగ్ యాప్‌లతో ఎంతోమంది యువకులు నష్టపోతున్నారని ఉన్నత న్యాయస్థానం దృష్టికి కేఏ పాల్ తీసుకువచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 04:05 PM