Share News

PM Modi Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. పహల్గాం ఘటనపై మన్ కీ బాత్‌లో పీఎం మోదీ..

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:57 PM

PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్‌ 121వ ఎసిపోడ్‌లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..

PM Modi Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. పహల్గాం ఘటనపై మన్ కీ బాత్‌లో పీఎం మోదీ..
PM Modi On Pehalgam Attack Mann Ki Baat

PM Modi Pahalgam controversy In Mann Ki Baat: ప్రతి నెలా చివరి ఆదివారం తన మనసులోని భావాలను రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా ప్రజలతో పంచుకుంటూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజు ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించే ప్రసంగించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన తన మనసును ఎంతగానో బాధించిందని.. దేశంలోని ప్రతి పౌరుడు ఆ బాధ అనుభవిస్తున్నారని అన్నారు. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని ఆక్రోశం వెలిబుచ్చారు. ఈ దాడి పిరికిపందల చర్య అని అన్నారు.


ఓర్వలేకే కుట్ర చేశారు..

ఆదివారం ప్రధాని నరేంద్ర మన్ కీ బాత్‌‌లో పహల్గా దాడి గురించి మాట్లాడుతూ, "కాశ్మీర్‌లో గత కొన్నేళ్ళ నుంచి పాఠశాలలు, కళాశాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి. తిరిగి శాంతియుత వాతావరణం కనిపించడం మొదలైంది. ఇది చూసి దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులు ఓర్వలేకపోయారు. మళ్లీ అంతా నాశనం చేయాలని పెద్ద కుట్రను అమలు చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ పోరులో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావమే అతిపెద్ద బలం. ఈ ఐక్యతే ఆధారం. దేశం ఈ సవాలును ఎదుర్కోవడానికి సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక్కటిగా మారాలి. ఈ దారుణ విషాదం తర్వాత దేశం మొత్తం ఒకే గొంతుకై మాట్లాడుతోంది. ప్రపంచం మనవైపే చూస్తోంది" అని అన్నారు.


బాధితులకు న్యాయం చేస్తానని హామి..

మిత్రులారా, ఈ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రపంచం నలుమూలల నుంచి నిరంతరం సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు. సందేశాలు కూడా పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాను. ఈ దాడికి పాల్పడిన వారిపైనా, కుట్రదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటాం.


Read Also: Indian Navy: మిసైల్స్‌ పరీక్షలు సక్సెస్.. యుద్ధానికి సిద్ధంగా నావికా దళం..

NIA To Probe Pahalgam Attack: పహల్గాం దాడిపై దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

Hanif Abbasi Threatens India: 130 అణుమిసైళ్లను భారత్‌ వైపు గురిపెట్టి రెడీగా ఉంచాం: పాక్ మంత్రి

Updated Date - Apr 27 , 2025 | 01:41 PM