Share News

Air India: ఎయిరిండియా విమానంలో సాకేంతిక లోపం.. చివరకు..

ABN , Publish Date - Jul 24 , 2025 | 09:23 AM

ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ముంబై వెళ్తుండగా విమానంలో సాకేంతిక లోపం తలెత్తింది. సమస్యను ముందుగానే గుర్తించిన అధికారులు విమానాన్ని ఆపేశారు.

Air India: ఎయిరిండియా విమానంలో సాకేంతిక లోపం.. చివరకు..

ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ముంబై వెళ్తుండగా విమానంలో సాకేంతిక లోపం తలెత్తింది. సమస్యను ముందుగానే గుర్తించిన అధికారులు విమానాన్ని ఆపేశారు. ప్రమాదం తప్పిపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఢిల్లీ నుంచి ముంబైకి (Delhi to Mumbai Air India flight) సుమారు 160 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైంది. కాసేపు ఉంటే విమానం టేకాఫ్ అవుతుందనగా.. కాక్‌పిట్‌లో పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో టేకాఫ్‌ను ఆపేశారు. ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు.


కేరళలోనూ..

కేరళలోనూ బుధవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 188 మంది ప్రయాణికులతో కాలికట్‌ నుంచి దోహాకు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. టేకాఫ్ అయిన విమానంలోని క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తింది. అధికారులు వెంటనే దీన్ని గుర్తించి.. సబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సదరు విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది.


ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 24 , 2025 | 09:59 AM