Share News

Digital Payments: ఇటు విదేశాలకు.. అటు ఆందోళనకు..

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:01 AM

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్‌ చెల్లింపుల చరిత్ర మారిపోయింది.

Digital Payments: ఇటు విదేశాలకు.. అటు ఆందోళనకు..

చర్చనీయాంశంగా మారుతున్న ‘యూపీఐ’ సేవలు

  • విదేశాల్లోనూ యూపీఐ సేవలకు రంగం

  • ‘పేపాల్‌ వరల్డ్‌ యాప్‌’తో అందుబాటులో

  • మరోవైపు బెంగళూరులో భారీగా యూపీఐ లావాదేవీలు జరగడంపై చిరువ్యాపారులకు జీఎస్టీ నోటీసులు

న్యూఢిల్లీ, జూలై 23: భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్‌ చెల్లింపుల చరిత్ర మారిపోయింది. చిన్న కిరాణా దుకాణంలో రెండు, మూడు రూపాయల నుంచి ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలుకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేదాకా దాని విస్తృతి పెరిగింది. అలాంటి యూపీఐ ఓవైపు విదేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంటే.. మరోవైపు చిరు వ్యాపారుల్లో ఆందోళనలకూ దారితీస్తోంది.


సెప్టెంబరు నుంచి ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించే పేపాల్‌ సంస్థ.. పెద్ద డిజిటల్‌ వాలెట్లు, చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ‘పేపాల్‌ వరల్డ్‌ యాప్‌’ను తీసుకువచ్చింది. అందులో యూపీఐ సేవలను భాగం చేసేందుకు ఇటీవలే ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)’తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. వివిధ దేశాలవారి మధ్యకూడా చెల్లింపులు సులువుగా జరిగేలా యూపీఐతోపాటు వెన్మో, టెన్‌పే గ్లోబల్‌ తదితర సంస్థలతోనూ పేపాల్‌ ఒప్పందాలు చేసుకుంది. దీనితో ఏ దేశంలోని వారు అయినా మరో దేశంలోని వారి మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి, వాలెట్‌ను ఎంపిక చేసుకుని డబ్బులు బదిలీ చేయడానికి వీలవుతుందని పేపాల్‌ సంస్థ తెలిపింది. ఉదాహరణకు అమెరికాలోని వారు పేపాల్‌ వరల్డ్‌ యాప్‌లో.. భారత్‌లోని ఓ వ్యక్తి మొబైల్‌ నంబర్‌ను నమోదు చేసి, ఇక్కడి జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి వాలెట్‌ను ఎంపిక చేసి నేరుగా డబ్బులు పంపవచ్చు. తరచూ విదేశాలకు వెళ్లేవారు, విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు సులువుగా చెల్లింపులు చేయడానికి, సొమ్ము బదిలీ చేయడానికి బాగా ఉపకరిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 04:01 AM